‘మిగ్జాం తుఫాన్ తమిళనాడును అతలాకుతలం చేస్తోంది. తమిళనాడు రాజధాని చైన్నై నీటమునిగింది. చైన్నైలోని కాలనీలో వరద ప్రవహిస్తోంది. చైన్నైఎయిర్‌పోర్ట్ నిండిపోయింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మిగ్జాం తుఫాన్ తమిళనాడు తీర ప్రాంతంలో తీవ్ర ప్రభావం చూపెడుతోంది. కొన్ని చోట్ల చెట్లు కూలిపోయాయి. కార్లు కొట్టుకుపోతున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఎయిర్ పోర్ట్‌లోకి నీళ్ల రావడంతో విమానాశ్రయాన్ని మూసి వేశారు. దీంతో పాటు పలు విమానాలను రద్దు చేశారు. కనథూర్ లో గోడ కూలి ఇద్దరు మృతి చెందారు. తమిళనాడు ప్రభుత్వం ఐదువేల పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేసింది. తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ ప్రస్తుత పరిస్థితులపై ఆరా తీశారు. ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. అవసరమైతే తప్ప ఎవరూ బయటకు రావొద్దని సూచించారు.
బీఆర్ ఎస్ కు ఇవే చివరి ఎన్నికలు… కేసీఆర్ శకం ముగిసింది.
తెలంగాణ ప్రజలకు కృతజ్ఞతలు: కేటీఆర్ ట్వీట్
దోమలను చంపే మెషన్ గన్ : వీడియో మీరు చూడండి