దీపం లాంటి కెసిఆర్ ఉండగా
పాపం లాంటి బిజెపి,కాంగ్రెస్‌లు అవసరమా
మంత్రి హరీష్ రావు
రంగారెడ్డి ః దీపం లాంటి కేసీఆర్ ఉండగా పాపం లాంటి బీజేపీ, కాంగ్రెస్ లు అవసరమా అంటూ మంత్రి హరీశ్‌రావు విమర్శించారు. ప్రజలు ఈరెండు పార్టలను నమ్మి మోసవపోవద్దన్నారు .రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు హరీశ్‌రావు ప్రారంభోత్సవం, శంకుస్థాపన చేశారు. ఈసందర్భంగా మంత్రి హరీశ్‌రావు మాట్లాడారు. బీజేపీ మోటార్లకు మీటర్లు పెట్టాలని , టీపీసీసీ అధ్యక్షుడు వ్యవసాయానికి మూడు గంటల కరెంటు సరిపోతుందని అంటున్నారని విమర్శలు గుప్పించారు. ఇటువంటి వారిని నమ్మితే నట్టేట మునుగుతామని హెచ్చరించారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మూడు పంటలు సాగు చేయాలంటున్నారని తెలిపారు. ఎవరు కావాలో ప్రజలే నిర్ణయించుకోవాలని కోరారు. నాడు నీళ్ల కోసం కొట్లాట, కనీళ్ల తండాట్లలేనన్నాని ఎద్దెవా చేశారు. ఏ కార్యక్రమం ప్రారంభించినా సీఎం మహిళలకు అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నట్టు చెప్పారు. కొంతమంది ఎన్నికల రాగానే అన్ని ఇస్తామంటున్నారని, ఓడ దాటే దాక ఓడ మల్లన్న.. ఓడ దాటాక బోడి మల్లన్న అన్నట్టు ప్రతిపక్షాలు వ్యవహరిస్తాయని వ్యగ్యంగా మాట్లాడారు. కర్ణాటకలో గెలిచిన కాంగ్రెస్ రైతులకు 8 గంటల కరెంటు కూడా ఇవ్వడం లేదన్నారు. రాజధాని బెంగళూరులో 4 గంటలే ఇస్తున్నట్టు చెప్పారు. మూడు గంటల కరెంటు ఇస్తే.. మూడు ఎకరాలు పారుతాయని రేవంత్‌రెడ్డి అంటున్నాడని, బీజేపీ వాళ్లు బావులకాడ మోటార్ల మీటర్లు పెట్టాలంటున్నారన్నారు.
Check Also
Sony Smart TV” స్మార్ట్ టీవీలపై బంపర్ ఆఫర్… ఇప్పుడే కొనండి..
Sony Smart TV” సోనీ బ్రావియా 2 సిరీస్ 108 సెం.మీ (43 అంగుళాలు) 4K అల్ట్రా HD స్మార్ట్ …
One Plus Phones”వన్‌ప్లస్ 13 ఆర్ ఏఐతో స్మార్ట్ ఫోన్..
One Plus Phones” వన్‌ప్లస్ (OnePlus) 13R | వన్‌ప్లస్ (OnePlus) ఏఐ(AI) తో మరింత స్మార్ట్ (12GB రామ్(RaM), …