శివాలయం కూలి ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురు మృతి

సిమ్లా ః శివాల‌యం కూలి ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురు మృతిచెందిన ఘ‌ట‌న హిమాచ‌ల్ ప్ర‌దేశ్‌లోని సిమ్లాలో బుధ‌వారం చోటు చేసుకుంది. సిమ్లా జిల్లాలోని సమ్మర్‌ హిల్‌ ప్రాంతంలోని ఆలయం కొట్టుకుపోవడంతో ఈ ప్రమాదంలో ఓ కుటుంబానికి చెందిన మూడు తరాల సభ్యులు మృత్య‌వాత ప‌డ‌డం విషాదం నింపింది. ఆల‌యం కూలినప్పుడు ముగ్గురు పిల్లలు తో పాటు ఆ కుటుంబానికి చెందిన ఏడుగురు గుడిలో ఉన్నారు. పవన్‌ శర్మ ఆయన భార్య సంతోషి కుమారుడు అమన్‌, కోడలు అర్చన, ముగ్గురు మనవరాళ్లు మృతుల్లో ఉన్నట్టు గుర్తించారు. ప్ర‌మాదం త‌ర్వాత ఐదుగురు కుటుంబసభ్యుల మృతదేహాలను గుర్తించారు. ఇదే కుటుంబానికి చెందిన ఇద్దరితో పాటు మరో ఇద్దరి ఆచూకీ ఇంకా లభించలేదు. తమ కుటుంబసభ్యుల మృతదేహాలు గుర్తించి తమకు అప్పగించాలని ఎదురుచూస్తున్నామని బాధిత కుటుంబానికి సవిూప బంధువు సునీత శర్మ కోరారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *