మనిషిని మనిషిగా చూసే మానవత్వం కలిగిన కులరహిత సమాజం కోసం పోరాడుదామని సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ నిజామాబాద్ జిల్లా సహాయ కార్యదర్శి దాసు కార్యకర్తలకు పిలుపునిచ్చారు.
జ్యోతిబాపూలే స్థాపించిన సత్యశోధక సంస్థ 150వ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా సిరికొండ మండల కేంద్రంలో సబ్ డివిజన్ కార్యదర్శి వి .బాలయ్య అధ్యక్షతన శనివారం సదస్సు నిర్వహించారు. ఈ సదస్సులో ముఖ్యఅతిథిగా పాల్గొని దాసు మాట్లాడుతూ.. భారతదేశంలో కుల రక్కసి ప్రజల మధ్య చిచ్చు పెట్టి, ప్రజల్ని సమస్యల రొంపిలో నెట్టుతోందన్నారు. అంటరానితనం నేరమని, కుల వివక్షత నేరమని చట్టాలు చేసిన కాగితాలకే పరిమితమైందని తెలిపారు. జ్యోతిబాపూలే సత్యశోధక సంస్థ ద్వారా విద్యను నేర్పించి, అందరం సమానమని భావాజాల వ్యాప్తికి కృషి చేశారని ఆయన ఈ సందర్భంగా తెలిపారు. వచ్చేదాకా కుల సమస్య చాయలు మనల్ని వెంటాడుతూనే ఉంటాయన్నారు. మానవీయ విలువలతో, శ్రామిక వర్గ దృక్పథంతో కుల నిర్మూలన కోసం కృషి చేద్దామని దాసు పిలుపునిచ్చారు.
ఈ సదస్సులో పార్టీ నాయకులు మార్క్స్, భూమేష్, పద్మ, సంజీవ్, గులామ్ హుస్సేన్, కట్ట ఉషన్న, లక్ష్మణ్, దేవిదాసు, నర్సింపల్లి గంగన్న, న్యాయానంది రాజన్న, శివరాజు, ప్రవీణ్, నర్సక్క, కళ్యాణి తదితరులు పాల్గొన్నారు.
Check Also
Smart TV Offers” గ్రేట్ రిపబ్లిక్ డే సేల్స్.. అతి తక్కువ ధరలో స్మార్ట్ టీవీలు
Smart TV Offers” సాంసంగ్ 108 సెంమీ (Samsung 108cm) (43) 4K Vivid Pro ఎల్ ఈడీ టీవీ …