తహసీల్దార్ ఇంట్లో ఏసీబీ సోదాలు నిర్వహించగా ఓ పెట్టెలో ఏకంగా రూ. 2 కోట్ల నగదు బయటపడింది. వివారల్లోకి వెళ్తే.. నల్గొండ జిల్లాలోని మర్రిగూడెం తహసీల్దార్‌గా మహేందర్ రెడ్డి విధులు నిర్వహిస్తున్నాడు. ఈయన ఇంట్లో శనివారం ఏసీబీ సోదాలు నిర్వహించింది. ఈ సోదాల్లో ఇంట్లో దాచిపెట్టిన సుమారు రూ. 2 కోట్ల నగదుతో పాటు బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. దీంతో పాటు పలు ఆస్తులకు సంబంధించిన కీలక పత్రాలను గుర్తించి విచారణ జరుపుతున్నారు.