Cricket News” కరీంనగర్ (Karimnagar) పటేల్ యూత్ ఫోర్స్ , మున్నూరు కాపు జర్నలిస్ట్ (Munnurukapu) ఫోరం సంయుక్తంగా నిర్వహిస్తున్న క్రికెట్ ప్రీమియర్ లీగ్ సీజన్-2 పోస్టర్లను కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ (Union MinisterBandi sanjay kumar) సోమవారం నగరంలోని మహాశక్తి టెంపుల్ లో ఘనంగా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, క్రీడలు శారీరక శక్తిని పెంపొందించడంతోపాటు మానసిక ధృఢత్వాన్ని పెంచుతాయని ఆయన పేర్కొన్నారు. క్రికెట్ వంటి క్రీడలు మానవ సంబంధాలను మరింత బలపరుస్తాయన్నారు. క్రీడల ద్వారా సోదరభావం, సహకారం, సమష్టి అభివృద్ధి స్ఫూర్తిని ప్రోత్సహించవచ్చున్నారు. (Munnurukapu) మున్నూరు కాపు జర్నలిస్ట్ ఫోరం పటేల్ యూత్ ఫోర్స్ (Patel youth Force) చేపట్టిన ఈ క్రికెట్ లీగ్ యువతకు ఒక మంచి వేదికగా నిలుస్తుందన్నారు. ఈ పోటీల ద్వారా యువతకు నాయకత్వ నైపుణ్యాలు, సమన్వయ సామర్థ్యాలు మెరుగుపడతాయి న్నారు. కుల అభివృద్ధి లక్ష్యాన్ని దృష్టిలో ఉంచుకొని, యువతను ఆ దిశగా ప్రోత్సహించాల్సిన అవసరం ఉందన్నారు. క్రీడల ద్వారా సమాజంలో ఏకతా భావాన్ని పెంపొందించగలుగుతాం. ఈ లీగ్ మరింత పెద్ద స్థాయిలో నిర్వహించాలని, తద్వారా యువత క్రీడల పట్ల ఆసక్తి పెరగాలని ఆశిస్తున్నానని పేర్కొన్నారు.
క్రికెట్ లీగ్ విజయం సాధించడానికి అహర్నిశలు కృషి చేస్తున్న యూత్ ఫోర్స్, (Munnurukapu) మున్నూరు కాపు జర్నలిస్ట్ ఫోరం సభ్యులను అభినందించారు. క్రీడలతో పాటు సామాజిక బాధ్యత తో ముందుకు వెళ్లాలన్నారు.
ఈ కార్యక్రమంలో యూత్ ఫోర్స్ గౌరవ అధ్యక్షులు వేల్పుల శ్రీనివాస్ పటేల్, సూదుల వెంకటరమణ పటేల్, జర్నలిస్ట్ ఫోరం సహాయ కార్యదర్శి రాచమల్ల సుగుణాకర్ పటేల్, జర్నలిజం ఫోరం ఈసీ మెంబర్ పోకల మధు పటేల్, కార్పొరేటర్లు కొలగాని శ్రీనివాస్ పటేల్, ఆనంద్ పటేల్ తదితరులు పాల్గొన్నారు. (Patel youth Force) పటేల్ యూత్ ఫోర్స్ కోర్ టీం సభ్యులు గాజుల శ్రీనివాస్ పటేల్, కట్ల మహేందర్ పటేల్, కొమిరిశెట్టి వెంకటేష్ పటేల్, తిరుమల శంకర్ పటేల్, చంద్రశేఖర్ పటేల్, పాల్గొన్నారు.
Smart TV” తక్కువ ధరలో కొత్త టీవీ కొనాలనుకుంటన్నారా..? ఇది చూడండి
Diabetes”షుగర్ వ్యాధికి కొత్తమందు.. అభివృద్ది చేసిన జపాన్ సైంటిస్టులు
సోనీ SRS-XB12 10W బ్లూటూత్ స్పీకర్ కొనుగోలు చేసేందుకు ఈ లింక ను క్లిక్ చేయండి.. https://bitli.in/wWQFLLd
Power Bank” టాటా వారి పవర్ బ్యాంక్ రూ.689లకే
Sony BRAVIA HD Ready TV” సోనీ హెచ్‌డీ రెడీ స్మార్ట్ 32 ఇంచుల టీవీ 23 వేలకే..
ASUS Vivobook” ఆసుస్ వివో బుక్ 16 ఇంటెల్ కోర్ ఐ7 ప్రాసెసర్ ₹63,990లకే..
Apple MacBook ” యాపిల్ మాక్‌బుక్ ₹56,990.. బుక్ చేయండి ఇప్పుడే..