Indiramma Indlu” ఇల్లు లేని పేదలకు ఇందిరమ్మ ఇల్లును మంజూరు చేస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం ఇదివరకే ప్రకటించింది. ఈ ఇండ్లను పేదలకు మంజూరు చేసేందుకు ప్రభుత్వం వేగంగా కసరత్తు చేస్తుంది. ఇది ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకున్న వారిని క్షేత్ర స్థాయిలో అధికారులు సర్వే చేస్తున్నారు. సంక్రాంతి వరకు (Indiramma Indlu) ఇండ్ల నిర్మాణాన్ని ప్రారంభించాలని ప్రభుత్వం భావిస్తున్నది. ఈ సందర్భంగా హిమాయత్‌నగర్‌లోని హౌసింగ్ కార్పొరేషన్ కార్యాలయంలో ఉన్నతాధికారులతో మంగళవారం ఇందిరమ్మ ఇళ్ల పథకంపై రెవెన్యూ, గృహ నిర్మాణశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి (Ponguleti Srinivas Reddy) సవిూక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా పలు వివరాలను వెల్లడించారు. ప్రజాపాలనలో (Indiramma Indlu) ఇందిరమ్మ ఇళ్ల కోసం 80 లక్షల దరఖాస్తు చేసుకున్నట్టు మంత్రి తెలిపారు. వీటికి సంబంధించి అధికారుల ఇప్పటి వరకు 32 లక్షల కుటుంబాల సర్వే పూర్తి చేసి మొబైల్ యాప్లో (mobile app)నమోదు చేసినట్టు ఆయన వెల్లడించారు. ఈ పరిశీలన జనవరి ఫస్ట్ వీక్ వరకు పూర్తవుతుందని తెలిపారు. తొందర్లోనే ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించిన వెబ్‌సైట్, టోల్ ఫ్రీ (Website, toll free) నంబర్ అందుబాటులోకి తీసుకొస్తామని చెప్పారు. జిల్లాకొక ప్రాజెక్టు డైరెక్టర్‌ను నియమించినట్టు తెలిపారు. నాలుగేండ్లలో 20 లక్షల (Indiramma Indlu) ఇండ్లను నిర్మించి తీరుతామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పునరుద్ఘాటించారు. ఫస్ట్ విడతలో నాలుగున్నర లక్షల ఇండ్లను (Indiramma Indlu) నిర్మించి ఇస్తామని స్పష్టం చేశారు.
ఈ ఇయర్ బడ్స్ నుకొనుగోలు చేసేందుకు కింది లింక్ ను క్లిక్ చేయండి….. https://bitli.in/60v6isl
Diabetes”షుగర్ వ్యాధికి కొత్తమందు.. అభివృద్ది చేసిన జపాన్ సైంటిస్టులు
Sony BRAVIA HD Ready TV” సోనీ హెచ్‌డీ రెడీ స్మార్ట్ 32 ఇంచుల టీవీ 23 వేలకే..
Nova Water Heater” నోవా వాటర్ హీటర్.. సంవత్సరం వారంటీ.. షాక్ ఫ్రూఫ్
Integrated residential schools” ఇంటిగ్రేటెడ్ రెసిడెన్సియల్ స్కూళ్లు.. ఎక్కడెక్కడంటే..
iq-5g-phone” ఐ క్యూ 5 జీ ఫోన్ కేవలం రూ. 13,999 కే.. అందుకోండి అమెజాన్‌లో