UpTrendingNews” ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలోని సాదాబాద్ కొత్వాలి ప్రాంతంలోని హత్రాస్ రోడ్డులో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. స్కూటీపై వెళ్తున్నతండ్రికొడుకుల కండ్లలో కారం చల్లి స్కూటీని ఎత్తుకెళ్లారు. వివరాల్లోకి వెళ్తే.. సాదాబాద్‌లోని ముర్సాన్ రోడ్‌లోని రామ్‌నగర్ కాలనీలో నివసించే ఓంప్రకాష్ వర్మ కుమారుడు బులియన్ వ్యాపారి మనోజ్ కుమార్ వర్మకు నగరంలోని ప్రధాన మార్కెట్‌లోని బజారియాలో బులియన్ దుకాణం ఉంది. ప్రతిరోజూ లాగే అతను రాత్రి 7.15 గంటల ప్రాంతంలో తన స్కూటర్‌పై తన కొడుకుతో కలిసి తన దుకాణం నుండి ఇంటికి తిరిగి వెళ్తున్నాడు. హత్రాస్ రోడ్డులోని కర్బన్ నది వంతెన సమీపంలోని స్టేట్ బ్యాంక్ ప్రధాన శాఖ ముందుకి అతను చేరుకుని రోడ్డు దాటడానికి ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో ముగ్గురు గుర్తు తెలియని వ్యక్తులు వారి వద్దకు వచ్చారు. ఈ వ్యక్తులు ముఖాలకు ముసుగులు ధరించారు. వీరు తండ్రికొడుకుల కండ్లలో కారం పొడి చల్లి, స్కూటర్ లాక్కొని పారిపోయారు. నేషనల్ మీడియా, మనోజ్ చెప్పిన వివరాల ప్రకారం.. తన స్కూటర్ ట్రంక్‌లో నగలతో నిండిన బ్యాగ్ ఉందని మనోజ్ వర్మ తెలిపారు. అందులో దాదాపు 200 నుండి 250 గ్రాముల బంగారు, వెండి ఆభరణాలు ఉన్నాయని వాపోయారు. పెండెంట్లు, ఉంగరాలు మరియు ఇతర ఆభరణాలు కూడా ఉన్నాయన్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ ఘటనకు సంబంధించిన సీసీ పుటేజీ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
View this post on Instagram
ఉత్తరప్రదేశ్‌లో కళ్ళలో కారం చల్లి స్కూటీని దొంగలించిన దుండగులు
హత్రాస్ జిల్లాలో స్కూటీ నడుపుతున్న వ్యక్తి కళ్ళలో కారం చల్లి అతని స్కూటీని ఎత్తుకెళ్లిన దుండగులు. స్కూటీ ట్రంక్‌లో 300 గ్రాముల బంగారు ఆభరణాలు ఉన్నట్లు తెలిపారు. సీసీ కెమెరాలో రికార్డ్ అయిన చోరీ దృశ్యాలు. pic.twitter.com/sQOX24QEiQ
— ChotaNews App (@ChotaNewsApp) February 16, 2025
ఇవి కూడా చదవండి
Madyapradesh Bride news” పెండ్లి వేడుకల్లో సడెన్ గా మృతిచెందిన వరుడు.. వీడియో
Amazon Offer” ఇంట్లోనే స్టేడియం బిగ్గర్ గేమ్.. బిగ్గర్ స్క్రీన్.. అమెజాన్ ఆఫర్ల బౌండరీలు