గంజాయి పై తెలంగాణ పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. విస్తృతంగా తనిఖీలు చేస్తూ కట్టుదిట్టమైన చర్యలతో గంజాయి సాగు, విక్రయాలు లేకుండా పక్కాగా చర్యలు తీసుకుంటున్నారు. కుమ్రం భీం జిల్లా జైనూర్ మండలం బుస్సిమెట్ట క్యాంప్ గ్రామంలో గంజాయిని సాగు చేస్తున్నారన్న సమాచారం మేరకు పోలీసులు దాడులు చేశారు. ఈ దాడుల్లో గ్రామానికి చెందిన ముగ్గురు రైతులు సాగు చేస్తున్న 418 గంజాయి మొక్కలను స్వాధీనం చేసుకున్నారు. యువకులు గంజాయి, ఇతర మత్తు పదార్థాలకు బానిస కావొద్దని జైనూర్ ఎస్సై సందీప్ కుమార్ సూచించారు. గంజాయి సాగు చేసిన సిరికొండ మనోహర్, జ్ఞానేశ్వర్ పాండురంగ్ ల కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై సందీప్ కుమార్ తెలిపారు.
ఇవికూడా చదవండి
రెడిమెడి సిటీనే బెస్ట్.. రాజధానిగా విశాఖనే ఫిక్స్ .?