అన్నపూర్ణ ఆంధ్రప్రదేశ్‌ను రాజధాని కష్టాలు వెంటాడుతూనే ఉన్నాయి. రాజధాని సమస్య ఇప్పటి ది కాదు. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తొలి నాళ్లలో కొత్త రాష్ట్రాల ఏర్పాటు నుంచే మొదలయ్యింది. మొదటి భాషా ప్రయుక్త రాష్ట్రంగా ఏర్పాటయిన ఆంధ్రప్రదేశ్ కు నాటి నుంచే రాజధాని కష్టాలు వెంటడాయి. అప్పటి మద్రాస్ రాష్ట్రం నుంచి ఆంద్రరాష్ట్రం ఏర్పడింది. మద్రాస్ సిటిని ఉమ్మడి రాజధానిగా కేటాయించాలని నాటి ఆంధ్రనాయకులు డిమాండ్ చేశారు. కానీ అందుకు తమిళులు ఒప్పుకోలేదు. తక్షణమే మద్రాస్ ను విడిచిపెట్టాలని హుకుం జారీ చేశారు. చేసేదేం లేక అప్పుడు కర్నూలు పట్టణంలో రాజధానిగా ఏర్పాటు చేసుకున్నారు. కొంత కాలం తరువాత తెలంగాణాను ఆంధ్రను కలిపి ఆంధ్రప్రదేశ్‌గా నూతన రాష్ట్రం ఏర్పడింది. తెలంగాణాకు రాజధానిగా ఉన్న హైదరాబాద్ ఆంధ్రప్రదేశ్ రాజధానిగా మారిపోయింది. కట్ చేస్తే ప్రత్యేక తెలంగాణ ఏర్పాటుతో మళ్లీ కథ మొదటికొచ్చింది. హైదరాబాద్‌ను పదేళ్ల పాటు గా ఉమ్మడి రాజధానిగా ప్రకటించారు. కానీ ఇంతకుముందు ఉన్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అమరావతిని రాజధానిగా ప్రకటించాడు. భూముల సేకరణ, డిజైన్లతో ఐదేండ్లు కాలం గడించింది. అనంతరం జరిగిన ఎన్నికల్లో వైసిపీ విజయం సాధించింది. ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ ప్రమాణ స్వీకారం చేశాడు. మొదట్లో సీఎం జగన్ మూడు రాజధానులంటూ ప్రణాళికలు వేశాడు. కానీ ఆ దిశగా అడుగులు పడలేదు.
విశాఖనే అనువైన పట్టణం
డిసెంబర్ నుంచి విశాఖ నుంచి పాలన సాగిస్తామని సీఎం జగన్ ప్రకటించాడు. నిజానికి వైజాగ్ అన్ని రకాలుగా రాజధానికి అనువైన ప్రాంతం.ఎందుకంటే విశాఖ అన్ని విధాల అభివృద్ధి చెందిన రెడీ మెడ్‌సిటి. ఇప్పటికే ఇక్కడ పోర్టు ఉంది. దీంతో పాటు సముద్ర తీరం కూడా విశాలంగా ఉండడం అనుకూల అంశం. మహారాష్ట్ర రాజధాని అయిన ముంబై, తమిళనాడు రాజధాని అయిన చెన్నై, కేరళ రాజధాని తిరువనంతపురం కూడా సముద్ర తీరాన్నే ఉన్నాయి. ఈ మూడు రాజధానులు రాష్ట్రానికి సెంటర్లో లేవు. అయినా అన్ని విధాల ఎంతోగానో అభివృద్ధి చేందాయి. ఇంతెందుకు అమెరికా రాజధాని వాషింగ్టన్ డి.సి కూడా సముద్రతీరానే ఉంది. అన్ని ప్రాంతాలకు దూరంగా కూడా ఉంది. విశాఖ పట్టణానికి రెండు వేళ ఏండ్ల చరిత్ర ఉంది. కర్నూలు రాజధానిగా ఉన్న సమయంలో అప్పటి ముఖ్యమంత్రి ప్రకాశం పంతులు విశాఖలో శాశ్వత రాజధాని ఏర్పాటు చేస్తామని ప్రకటించాడు. ఇప్పడు ఆంధ్ర సీఎం జగన్ విశాఖపట్టణాన్ని ఎంచుకోవడం ఓ సరైన నిర్ణయమేనని చాలా మంది అంగీకరిస్తున్నారు. విశాఖపట్నం లో ఇన్ఫోసిస్ భవనాన్నిసీఎం జగన్ గత సోమవారం ప్రారంభించారు. హైదరాబాద్, బెంగళూరు, చెన్నై తరహాలో ఐటి రంగంలో విశాఖకు అన్ని అర్హతలూ, సామర్థ్యం ఉన్నాయి. సిఎం జగన్ మోహన్ రెడ్డి కూడా ఇదే ప్రకటించారు. విశాఖ పట్టణంలో ఎన్నో ప్రతిష్టాత్మక సంస్థలు ఉన్నాయి. ఎన్నో ఇంజనీరింగ్‌కాలేజీలు, యూనివర్సిటీలు, మెడికల్ కళాశాలలు, డిగ్రీ కాలేజీలు ఉన్నాయి. విశాఖ నుంచి ఏటా12 నుంచి 15 వేల మంది ఇంజనీర్లు తయారవుతున్నారు. ఐఐఎం, నేషనల్ లా యూనివర్సిటీ సంస్థలూ, ఐఒసి విశాఖ నగరంలో కొలువుదీరాయి. 20 వేల ఈస్టర్న్ నేవల్ అధికారుల కుటుంబాలు ఉన్నాయి. ప్రతిష్టాత్మక విశాఖ పోర్టు, గంగవరం పోర్టు ఉన్నాయి. వేచిచూడాలి రాబోయే రోజుల్లో ఏం జరగనుందో. ఇంకా ఎన్ని నగరాలకు రాజధానిని పరిశీలిస్తారో…
ఇవి కూడా చదవండి
ప్లీజ్ నన్ను విడిపించండి.. యువతి వీడియో విడుదల
బాణాసంచా ఫ్యాక్టరీలో పేలుడు 9మంది దుర్మరణం
హోటళ్లకు రేటింగ్ ఇవ్వాలి.. 13 లక్షలు హాం ఫట్
షి’కారు’లో రోమాన్స్.. స్వేచ్చ ఉంది కదా అని.. సజ్జనార్ ట్విట్.. వీడియో వైరల్