గంగాధర వద్ద రోడ్డు ప్రమాదం: ఆటోను ఢీకొట్టిన వ్యాన్, మహిళా కూలీ మృతి.. ఎనిమిది మందికి తీవ్ర గాయాలు
జగిత్యాల-కరీంనగర్ ప్రధాన రహదారిపై గంగాధర మండలం మధురానగర్ చౌరస్తా వద్ద ఘోర రహదారి ప్రమాదం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. మంగపేట గ్రామానికి చెందిన 10 మంది మహిళా కూలీలు ఆటోలో పత్తి కలుపు తీసే పనులకు వెళ్తుండగా, జగిత్యాల వైపు నుంచి వేగంగా వచ్చిన కోళ్ల వ్యాన్ ఆటోను వెనుక నుంచి బలంగా ఢీకొట్టింది.
ప్రమాద వివరాలు:
మృతురాలి వివరాలు: తీవ్రంగా గాయపడిన కూలీలను 108 అంబులెన్స్‌లో కరీంనగర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ మంగపేటకు చెందిన లింగాల దేవమ్మ మృతి చెందారు.

క్షతగాత్రులను పరామర్శిస్తున్న చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం
గాయపడిన వారు: అతికం మమత, పుల్లెల లక్ష్మి, గుర్రం సరవ్వ, గుర్రం లక్ష్మి, నాగలి మాధవి, నాగెళ్లి రాధ, నాగెళ్లి లక్ష్మి, చొప్పదండి శైలజ తీవ్రంగా గాయపడ్డారు. కొందరికి కాళ్లు, చేతులు విరగడంతో కరీంనగర్ సివిల్, మెడికవర్ ఆసుపత్రుల్లో చికిత్స అందిస్తున్నారు.
నాయకుల పరామర్శ:
మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ వెంటనే ప్రమాద స్థలానికి చేరుకుని బాధితులను ఆసుపత్రికి తరలించే ఏర్పాటు చేశారు.
సమాచారం అందుకున్న ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం ఆసుపత్రికి వెళ్లి చికిత్స పొందుతున్న క్షతగాత్రులను పరామర్శించారు. అనంతరం బాధితులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని వైద్యులను ఆదేశిస్తూ, ప్రమాదంలో దెబ్బతిన్న కుటుంబాలకు ప్రభుత్వం తరఫున అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ఈ ప్రమాదంతో మంగపేట గ్రామంలో తీవ్ర విషాద ఛాయలు అలముకున్నాయి
ఓలా S1Z ఎలక్ట్రిక్ స్కూటర్ ఆవిష్కరణ: రూ. 79,999 లకే 301 కిమీ రేంజ్, స్వదేశీ బ్యాటరీ!
