: బ్రహ్మకుమారీస్ సంస్థ పిలుపు
(అబూ రోడ్ రాజస్థాన్ నుంచి బాపూరావు) :
ప్రపంచ శాంతిస్థాపనకు మీడియా కృషి చేయాలని, ఆ బృహత్తతర కార్యక్రమంలో భాగస్వామి కావాలని బ్రహ్మకుమారీస్ సంస్థ పిలుపునిచ్చింది. రాజస్థాన్ రాష్ట్రంలోని అబూ రోడ్ శాంతివనంలో బ్రహ్మకుమారీస్ సంస్థ మీడియా విభాగం ఆధ్వర్యంలో ఐదు రోజుల పాటు జాతీయ మీడియా సదస్సు నిర్వహించారు. ఈ సదస్సులో భారత్, నేపాల్ దేశాల నుంచి పలు మీడియా సంస్థల ప్రతినిధులు హాజరయ్యారు. తెలంగాణ నుండి సీనియర్ జర్నలిస్ట్ కుడుతాడి బాపురావు ఆధ్వర్యంలో సీనియర్ జర్నలిస్టులు బండి విజయ్ కుమార్, గాదె కరుణాకర్, ఎం గోపాల్ తో పాటు 15 మంది జర్నలిస్టులు సదస్సులో పాల్గొన్నారు. సదస్సులో పలువురు పలు ప్రతిపాదనలను సమర్పించగా, వాటిని ప్రతినిధులు ఏకగ్రీవంగా ఆమోదించారు.
ఆమె ప్రాణాలకు విలువ లేదు… ఒక చెక్ రాయండి..
ముఖ్యమైన ప్రతిపాదనలను కాన్ఫరెన్స్‌లో చర్చించారు. మీడియా కర్తవ్యం కేవలం సమాచారాన్ని అందించడం, వార్తలను ప్రసారం చేయడం మాత్రమే కాదని, మనల్ని మనం అర్థం చేసుకునేందుకు మరియు ప్రపంచంలో శాంతిని నెలకొల్పడానికి నైతిక విలువల సమతుల్యతను నెలకొల్పడానికి కృషి చేయవలసిన అవసరం ఎంతో ఉందని వక్తలు అభిప్రాయపడ్డారు. సమాచారాన్ని లేదా వార్తలను జనానికి చేరవేయడంతో పాటు మానవ సమాజంలో నైతిక విలువలను పెంపొందించడం మీడియా బాధ్యతగా గుర్తించాలని సూచించారు.
విమానంలో పాడుపని… ట్విట్టర్‌లో వీడియో వైరల్
మీడియా దేశానికి, సమాజానికి కావాలసిన అవసరాలను తీరుస్తూనే, దేశసమాజంలో సామరస్యత నెలకొల్పుటకు కీలక పాత్ర పోషించాలని స్పష్టం చేశారు. సామరస్య ప్రపంచ సాధనలో మీడియా ప్రతినిధులకు కావాల్సిన మద్దతు, పూర్తి సహకారాన్ని బ్రహ్మకుమారీస్ సంస్థ మీడియా విభాగం ఎల్లప్పుడూ అందిస్తుందని పేర్కొన్నారు. భారత్ ఆతిథ్యంలో జీ-20 దేశాల శిఖరాగ్ర సదస్సు విజయం సాధించడం పట్ల జాతీయ మీడియా సదస్సు హర్షం వ్యక్తం చేసింది. ప్రపంచంలో శాంతి స్థాపన, అభివృద్ధి దిశగా అడుగులు వేయడానికి భారత్ తన సంపూర్ణ సహకారం అందిస్తోందని పేర్కొన్నారు. సమాజ సంక్షేమం, శ్రేయస్సు, సంతోషం, అభివృద్ధి కోసం కృషి చేయడంలో అందరి సహకారం అవసరమని సదస్సులో పలువురు అభిప్రాయపడ్డారు. మీడియా ప్రతినిధులు ఆధ్యాత్మికపరంగా జ్ఞానం పొందడంతో పాటు రాజయోగం పొందే విధంగా బ్రహ్మకుమారీస్ సంస్థ తన వంతు కృషి చేస్తుందని సంస్థ తరఫున ప్రతినిధులు వెల్లడించారు. సదస్సు సందర్భంగా ఏర్పాటుచేసిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. ఈ సదస్సులో విద్యా విభాగ చైర్ పర్సన్ బీకే మృత్యుంజయ సదస్సుకు అధ్యక్షత వహించగా అంతర్జాతీయ మోటివేషనల్ స్పీకర్ శివాని బెహన్, ప్రొఫెసర్ మాన్ సింగ్ పార్మర్, లోక్ సభ సభ్యులు కుల్దీప్ రాయి శర్మ, మీడియా విభాగ జాతీయ కో-ఆర్డినేటర్ బీకే సరళ, పీఆర్ఎస్ఐ మాజీ సెక్రెటరీ జనరల్ వై.బాబ్జీ, డాక్టర్ కమ్లేశ్ మీనా, జానకి టీవీ మైసూర్ ఎండీ మహాదేవ స్వామి, ఓంవీర్ సింగ్ సైని, ఆశిష్ గుప్తా, బీకే విజయ, బీకే అమర్ చందర్ తమ సందేశానిచ్చారు.
కొట్టుకుపోయిని సిటీ.. 5,300 మంది మృతి.. 10 వేల మంది గల్లంతు
భర్తను చంపి.. తప్పించుకోబోయి..
మా వార్తలు మీకు నచ్చినట్టయితే గంట గుర్తును నొక్కి నోటిఫికేషన్ అలో అనండి.. సమగ్రమైన వార్తలను చదవండి