కనివినీ ఎరుగని జలప్రళయం.. ఊహకందని విషాదం..కండ్లు మూసి తెరిచేలోగా పట్ణణమే వరదలో చిక్కకుంది. 5,300 మంది మృతి, 10 వేల మంది గల్లంతు ఇంతటి విషాదకర ఘటన ఆఫ్రికా దేశమైన లిబియాలోని డెర్నా పట్టణంలో చోటుచేసుకుంది. ఆదివారం రాత్రి నుంచి కురుస్తున్న భారీ వర్షాలకు ఆకస్మిక వరదలు సంభవించాయి. లిబియాలోని డెర్నా పట్టణాన్ని ఆనుకోని ఉన్న డ్యామ్ తెగిపోవడంతో సీటి మొత్తం తుడిచిపెట్టుకుపోయింది.
ఆమె ప్రాణాలకు విలువ లేదు… ఒక చెక్ రాయండి..
ఎక్కడ చూసినా శవాలు గుట్టలుగుట్టలుగా పడిఉన్నాయి. వాహనాలు చెల్లాచెదురుగా పడిఉన్నాయి.. అంతర్జాతీయ విూడియా కథనాల నుంచి సేకరించిన సమాచారం ప్రకారం… ఇప్పటి వరకూ ఈ జల ప్రళయంలో సుమారు 5,300 మంది ప్రాణాలు కోల్పోయారు. 10 వేల మందికిపైగా ప్రజలు గల్లంతయ్యారు. 1,000 మృతదేహాలను గుర్తించి ఖననం చేసినట్లు స్థానిక అధికారులు తెలిపారు. ఈ జల ప్రళయానికి అనేక ప్రాంతాలు పూర్తిగా అతలాకుతలమయ్యాయని.. ముఖ్యంగా డెర్నా నగరం పరిస్థితి అత్యంత దయనీయంగా మారింది. వరదల తాకిడికి రెండు డ్యాములు కొట్టుకుపోయాయంటే జల విలయం ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. డ్యాములు ధ్వంసం కాగా అక్కడ్నుంచి పోటెత్తిన వరద నీటిలో అనేకమంది మధ్యధరా సముద్రంలోకి కొట్టుకుపోయారని అంతర్జాతీయ విూడియాలో వార్తలు వెలువడ్డాయి. డెర్నా సిటీ పక్కన ఉన్న డ్యామ్ కొట్టుకపోవడంలో కుట్ర కూడా దాగి ఉందని అక్కడి ప్రజలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
విమానంలో పాడుపని… ట్విట్టర్‌లో వీడియో వైరల్
మా వార్తలు మీకు నచ్చినట్టయితే గంట గుర్తును నొక్కి నోటిఫికేషన్ అలో అనండి.. సమగ్రమైన వార్తలను చదవండి