భార్యాపిల్లలను తుపాకితో కాల్చి ఆపై తానూ ఆత్మహత్య చేసుకున్న ఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కడప జిల్లాలో బుధవారం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. వెంకటేశ్వర్లు (50) అనే వ్యక్తి కడప టూటౌన్‌లో హెడ్ కానిస్టేబుల్‌గా విధులు నిర్వర్తిస్తున్నడు. ఈయన కడప పట్టణంలోని కో ఆపరేటివ కాలనీలో భార్యపిల్లలతో విధులు నిర్వర్తిస్తున్నాడు. ఈ క్రమంలో బుధవారం రాత్రి 11 గంటలకు భార్యాపిల్లలను తుపాకితో కాల్చి తానూ ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన గురించి తెలుసుకున్న జిల్లా ఎస్పీ సిద్ధార్థ కౌశల్ ఘటనా స్థలాన్ని పరిశీలించారు. కానిస్టేబుల్ ఇలా చేయడానికి గల కారణాలపై ఆరా తీశారు కుటుంబ కలహాలు. వ్యక్తిగత కారణాలతోనే వెంకటేశ్వర్లు ఆత్మహత్య చేసుకున్నట్లు కడప డీఎస్పీ షరీఫ్ చెప్పారు.
సిక్కింలో వరదలు 14 మంది మృతి