సిక్కిం రాష్ట్రాన్ని ఆకస్మిక వరదలు చుట్టుముట్టాయి. వరద ప్రభావానికి నాలుగు జిల్లాల్లో రోజువారీ కార్యకలాపాలు ఆగిపోయాయి. ఇప్పటి వరకు 14 మంది మృతి చెందారు. ఇంకో 16 మందికి గాయాలయ్యాయి. 102 మంది గాయాలయ్యాయి. వీరికోసం సహాయ బృందాలు వెతుకుతున్నాయి. సిక్కిం రాష్ట్ర సీఎం తమాంగ్ వరద ఉన్న ప్రాంతాల్లో కలియ తిరిగారు. నష్టపోయిన కుటుంబాలను ప్రభుత్వం తరపున ఆదుకుంటామని చెప్పారు. విధుల్లో ఉన్న 22 మంది జవాన్లు కూడా గల్లంతయ్యారు.నాలుగు జిల్లాల్లో వరద ప్రభావం ఉండగా 26 పునరావస క్యాంపులు ఏర్పాటు చేశారు. ఈ మూడు జిల్లాల్లో 11 బ్రిడ్జిలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. చాలా చోట్ల డ్రైనేజీలు తెగిపోయాయి. 227 నివాసాలు దెబ్బతిన్నాయి. చుంగ్‌తాంగ్ సిటీలోని 80శాతం తీవ్రంగా వరద ప్రభావానికి గురైంది.