12ft King Cobra” పాము కనపడితేనే చాలా మంది హడలెత్తిపోతారు. అటువంటి 12 అడుగుల కింగ్ నివాసలు ఉండే ప్రాంతాల్లో కనపడింది. వివరాల్లోకి వెళ్తే.. కర్నాటక రాష్ట్రంలోని అగుంబే గ్రామంలో 12 అడుగుల కింగ్ కోబ్రా రోడ్డు దాటడాన్ని స్థానికులు గమనించారు. ఆ తరువాత ఆ పాము ఓ ఇంట్లోకి వెళ్లి చెట్టు పైకి ఎక్కింది. దీంతో అక్కడి వారు ఫారెస్ట్ అధికారులకు సమాచారమిచ్చారు. రెయిన్ ఫారెస్ట్ రీసెర్చ్ స్టేషన్‌లో ఫీల్డ్ డైరెక్టర్‌గా పనిచేస్తున్న అజయ్ గిరి తన టీంతో కలిసి వచ్చి పామును బంధించి అడవిలో వదిలేశారు. దీనికి సంబంధించిన వీడియోను అజయ్ గిరి తన ఇన్‌స్టా గ్రాం ఖాతాలో షేర్ చేశారు.
View this post on Instagram