Up Road Accident” పెండ్లికి వెళ్లి వస్తున్న క్రమంలో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో ఆరుగురు అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ఘటన ఉత్తర ప్రదేశ్‌లోని ఫిలిబిత్‌లో శుక్రవారం తెల్లవారు జామును చోటు చేసుకుంది. ఉత్తరాఖండ్‌లోని ఖతిమా నుండి కొంతమంది వ్యక్తులు ఒక వివాహానికి హాజరయి తిరిగి వెళ్తున్నారు. ఈ క్రమంలో కారు అదుపు తప్పి రోడ్డు పక్కన ఉన్న చెట్టును ఢీకొట్టింది. ఈ ఘటన న్యూరియా పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఈ ఘటనలో ఆరుగురు అక్కడికక్కడే మృతి చెందారు. సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకున్నారు. క్షతగాత్రులను సమీపంలోని ఆస్పత్రికి తరలించారు.
మరోఘటన
చిత్రకూట్‌లో చోటు చేసుకుంది. మహీంద్రా బొలెరో ట్రక్కు ఎదురెదురుగా ఢీకొనడంతో ఐదుగురు మరణించార. ఈ సంఘటన రాయపురా పోలీస్ స్టేషన్ పరిధిలో శుక్రవారం ఉదయం 5.30 గంటలకు చోటు చేసుకుంది. బొలెరో ప్రయాగ్‌రాజ్ నుంచి వస్తున్నది. ట్రక్ రాయ్‌పురా నుంచి వస్తున్న క్రమంలో రెండు ఎదురెదురుగా ఢీకొన్నట్టు స్థానిక పోలీసు అధికారి తెలిపారు. బొలెరోలో 11 మంది ఉన్నారు. ఐదుగురు మృతిచెందారు. గాయపడ్డ వారిని దగ్గర్లో దవాఖానాకు తరలించారు.
New RTC Bus Depo” రాష్ట్రంలో రెండు ఆర్టీసీ బస్సు డిపోలు.. ధన్యవాదాలు తెలిపిన మంత్రి సీతక్క