Karimnagar news” చ‌ట్టాల‌పై అవ‌గాహ‌న పెంచుకోవాలి: సీనియర్ సివిల్ జడ్జి కే వెంకటేష్

Karimnagar news

Karimnagar news” ప్రతి మనిషికి రాజ్యాంగము హక్కులను ప్రసాదించిందని ఇలాంటి హక్కులను కాపాడుకోవడానికి చట్టాలు చేయబడ్డాయని సీనియ‌ర్ సివిల్ జడ్జి కె. వెంక‌టేశ్ అన్నారు. ప్రతి విద్యార్థి హక్కులను కాపాడుకోవడం కోసం చట్టాలపై అవగాహన పెంచుకోవలసిన బాధ్యత ఉందని చెప్పారు. మానవ హక్కుల దినోత్సవం సందర్భంగా జాతీయ న్యాయ సేవ అధికార సంస్థ ఆదేశాలకు అనుగుణంగా జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి కే వెంకటేష్ ఆధ్వర్యంలో పట్టణంలోని డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ప్రభుత్వ ఆదర్శ ఆవాస మహిళా పాలిటెక్నిక్ కళాశాలలో మంగ‌ళ‌వారం న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా సీనియర్ సివిల్ జడ్జి మాట్లాడారు. ప్రతి మనిషికి రాజ్యాంగము హక్కులను ప్రసాదించిందన్నారు. ఇలాంటి హక్కులను కాపాడుకోవడానికి చట్టాలు చేయబడ్డాయని చెప్పారు. ప్రతి విద్యార్థి వారి యొక్క హక్కులను కాపాడుకోవడం కోసం చట్టాలపై అవగాహన పెంచుకోవలసిన బాధ్యత ఉందని వివరించారు. కష్టపడి చదువుకొని వివిధ రంగాలలో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని సూచించారు. ఈ సందర్భంగా కళాశాలలో వంటగదిని, ఆహారాన్ని పరిశీలించారు. విద్యార్థులకు అందించే ఆహారంలో పరిశుభ్రత పాటించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో సీనియర్ సివిల్ జడ్జి తో పాటు, లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ తణుకు మహేష్,కళాశాల ప్రధానోపాధ్యాయురాలు శోభారాణి, క‌ళాశాల‌ సిబ్బంది పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *