Thursday , 19 September 2024
Breaking News

భ‌ర్త‌ను చంపింది… తొమ్మిందేండ్ల‌కు దొరికింది.. ఇన్నాళ్లు ఆరా తీయ‌లేదా…

భార్య‌భ‌ర్త‌లు అన్నాకా గొడ‌వ‌లు స‌హ‌జం.. కొంత‌మందిలో అవి తీవ్ర‌స్థాయిలో ఉంటాయి. మ‌రికొంత‌మంది విడిపోయి బ‌తుకుతారు. కొన్ని చోట్ల భ‌ర్త లేదా భార్య హ‌త్య‌ల‌కు కూడా గుర‌వుతుంటారు. హ‌త్య‌చేసి త‌ప్పించుకునేందుకు ఎన్నో ఉపాయాలు ప‌న్నుతుంటారు. కానీ పోలీసుల విచార‌ణ‌ ముందు అవి చిత్తు అయిపోతాయి. నెల‌కో.. రెండు నెల‌ల‌కో పోని యాడిదికో నేర‌స్తుల‌ను పట్టుకుని క‌ట‌క‌టాల్లోకి నెట్టుతారు. కానీ త‌మిళ‌నాడులో జ‌రిగిన ఈ హ‌త్య మాత్రం తొమ్మిదేండ్లలో ఏనాడు బ‌య‌ట‌కు రాలే.. భ‌ర్త‌ను చంపిన ఆవిడ అన్నెం, పున్నెం ఎరుగ‌దానిలా అదే ప్రాంతంలో త‌న ప‌ని తాను చేసుకుపోయింది. ఇంటి ఓన‌ర్ ఫిర్యాదుతో కేవ‌లం 24 గంట‌ల్లో పోలీసులు చేధించారు. వివరాల్లోకి వెళ్తే.. త‌మిళ‌నాడులోని శివ‌గంగ జిల్లాకు చెందిన ఒకాయ‌న‌కు మూడు నాలుగు ఇండ్లు ఉన్నాయి. అందులో దేవ‌కొట్ట‌యి ప్రాంతంలోని ఓ ఇంటిని తొమ్మిదేళ్ల క్రితం సుకాంతి, పాండ్య‌న్ అనే దంప‌తుల‌కు ఇంటిని కిరాయికి ఇచ్చాడు. వారు కొన్నాళ్లు ఉన్న త‌రువాత ఇంటిని ఖాళీ చేసే వేరే చోటుకు వెళ్లిపోయారు. ఈ క్ర‌మంలో రెండు రోజుల క్రితం ఇంటి ప‌రిస‌రాల్లో ఉన్న మురుగు నీటిని యాజ‌మాని కొంత‌మంది మ‌నుషుల‌తో శుభ్రం చేయిస్తున్న‌ప్పుడు ఓ పుర్రె బ‌య‌ట‌ప‌డింది. దీంతో ఆయ‌న వెంట‌న స్థానిక పోలీసుల‌కు ఫిర్యాదు చేశాడు. రంగంలోకి దిగిన పోలీసులు విచార‌ణ ప్రారంభించారు. ఇంటి ఓన‌ర్ ఆ పుర్రె గురించి తెలియ‌ద‌న‌డంతో చుట్టుప‌క్క‌ల వాళ్ల‌ను విచారించారు. వాళ్లు కొన్నేండ్ల క్రితం ఇద్ద‌రు భార్య‌భ‌ర్త‌లు ఉండేవాళ్ల‌ని ఆమె భ‌ర్త విదేశాల‌కు వెళ్లాడ‌ని త‌మ‌తో చెప్పేద‌ని తెలిపారు. ఆయ‌న విదేశాల‌నుంచి ఎప్పుడూ తిరిగి రాలేద‌ని వివ‌రించారు. దీంతో ఆవిడ కోసం పోలీసులు వెతికారు. అదే ప్రాంతంలో ఉంటున్న సుకాంతిని అదుపులోకి తీసుకొని విచారించ‌గా ఆమె త‌న‌కేం తెలియ‌ద‌ని బుకాయించింది. త‌న భ‌ర్త వేరే మ‌హిళ‌తో ఉంటున్నాడ‌ని పోలీసుల‌ను న‌మ్మించే ప్ర‌య‌త్నం చేసింది. కానీ పోలీసులు త‌మ‌దైన శైలిలో ప్ర‌శ్నించ‌డంతో నిజాన్ని ఒప్పుకుంది. త‌న భ‌ర్త‌ను తానే చంపిన‌ట్టు అంగీక‌రించింది. ఆమెను అరెస్టు చేసి కోర్టులో హాజ‌రుప‌రిచారు.

అస‌లు ఆ రోజు ఏం జ‌రిగింది..
తొమ్మిదేళ్ల క్రితం సుకాంతి పాండ్య‌న్‌ల మ‌ధ్య గొడ‌వ జ‌రిగింది.దీంతో ఆమె త‌న పుట్టింటిక పోతాన‌ని ప్ర‌య‌త్నించింది. వెంట‌నే పాండ్య‌న్ అడ్డుకునే ప్ర‌య‌త్నం చేశాడు. పాండ్య‌న్ సుకాంతి గ‌ట్టిగా తోసేయ‌డంతో కింద‌ప‌డిపోయాడు. ఇది గ‌మ‌నించ‌ని సుకాంతి త‌న పుట్టింటికి వెళ్లిపోయింది. మ‌రుస‌టి రోజు వ‌చ్చి చూసేస‌రికి పాండ్య‌న్ చ‌నిపోయి ఉన్నాడు. దీంతో హ‌త్య నుంచి త‌ప్పించుకునేందుకు భ‌ర్త‌ మృత దేహాన్ని ఇంటిప‌రిస‌రాల్లోని మురుగు నీటి ట్యాంక్‌లో ప‌డేసింది. చుట్టు ప‌క్క‌ల వారికి త‌న భ‌ర్త విదేశాల‌కు వెళ్లాడ‌ని చెప్పుకొచ్చింది. త‌ర్వాత కొన్నాళ్ల‌కు ఆ ఇంటిని ఖాళీ చేసి వెళ్లిపోయింది. తాజా ఇంటి ఓన‌ర్ ఫిర్యాదుతో హ‌త్య గురించి బ‌య‌ట‌కు వ‌చ్చింది.

ఇన్నెళ్ల‌లో అత‌డి బంధువులు ఏం చేశారు.
తొమ్మిదేండ్ల నుంచి త‌మ‌లో ఒకరు క‌న‌ప‌డ‌కుండా పోతే ఎవ‌రైనా ఆరా తీస్తారు. అయినా దొర‌క‌క‌పోతే పోలీసుల‌ను ఆశ్ర‌యిస్తారు. కానీ పాండ్య‌న్ బంధువులు ఇన్నాళ్లు ఎందుకు సైలెంట్‌గా ఉన్నారు. సుకాంతి మీద అనుమానం ఎందుకు వ్య‌క్తం చేయ‌లేదో..

About Dc Telugu

Check Also

Spin Mop

Spin Mop” స్పిన్ మాప్ టూఇన్ వ‌న్.. 40 శాతం త‌గ్గింపుతో.. కేవ‌లం రూ. 1089కే .. నాలుగు పీస్‌లు

ఇల్లు తుడించేందుకు ఉపయోగ‌ప‌డే స్పిన్ మాప్ పై అమెజాన్ ఆన్‌లైన్ షాపింగ్‌లో భారీ త‌గ్గుద‌ల ప్ర‌క‌టించింది. 40 శాతం త‌గ్గింపు …

Redmi LED Fire TV

Redmi LED Fire TV” 32 ఇంచుల టీవీ కేవ‌లం కేవ‌లం రూ. 11499 కే..

Redmi LED Fire TV” రెడ్ ఎంఐ నుంచి 32 ఇంచుల టీవీ కేవ‌లం రూ. 11,499 కే స్మార్ట్ …

Wooden Table Desk

Wooden Table Desk” రూ. 2నుంచి 3 వేల లోపు మంచి స్ట‌డీ, ల్యాప్‌టాప్ టేబుల్.. ఇప్పుడే ఆర్డ‌ర్ చేయండి

Wooden Table Desk” పిల్ల‌ల చ‌దువు కోసం కానీ లేదా ల్యాప్టాప్ కోసం త‌క్కువ ధ‌ర‌లో మంచి టేబుల్ కోసం …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Social Media Auto Publish Powered By : XYZScripts.com