సోమవారం నాడు భారత దౌత్యవేత్త , రాయబార కార్యాలయ ఉద్యోగి అయినటువంటి పవన్ కుమార్ రాయ్‌ను కెనడా బహిష్కరించింది. దీనిని భారత్ తీవ్రంగా పరిగణించింది. కెనడాకు చెందిన దౌత్యవేత్తను భారత్ బహిష్కరించింది. ఐదు రోజుల్లో భారత్‌ను విడిచి వెళ్లాలని కోరింది. ఈ విషయాన్ని కెనడ హైకమిషనర్‌కు తెలిపింది.
అసలు ఈ గొడవలకు ఈ కారణాలను ఒకసారి పరిశీలిస్తే…
భారత్ నుంచి ఖలిస్తాన్ ఏర్పాటు చేయాలనే ఉద్యమం ఎప్పటినుంచో సాగుతుంది. దీనికి సంబంధించి కెనడాలో హర్‌దీప్‌సింగ్ నిజ్జర్ కెనడాలో తీవ్రస్థాయిలో ఉద్యమం నడిపిస్తున్నడు. ఈ క్రమంలో కొన్ని జూన్ 18 న కెనడాలోని బ్రిటిష్ కొలంబియా ప్రావిన్స్‌లో గల సిక్కు దేవాలయం వద్ద హర్‌దీప్ సింగ్‌పై దుండగులు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో హర్‌దీప్‌సింగ్ మృతిచెందాడు.
దీనిపై తాజాగా సోమవారం నాడు కెనడా ప్రధాన మంత్రి జస్టిస్ ట్రూడో భారత్ ను నిందించాడు. హర్‌దీప్ సింగ్‌పై కాల్పుల వెనుక భారత్ హస్తం ఉందంటూ ఆరోపణలు చేశాడు. తమ గడ్డపై తమదేశపౌరుడిని కాల్చి చంపడం దారుణమన్నారు. అంతేకాకుండా భారత్ రాయబారి ఉద్యోగి, దౌత్యవేత్త పవన్‌రాయ్‌ని కెనడా నుంచి బహిష్కరించింది.
దెబ్బకు దెబ్బ…
అదే స్థాయిలో భారత్ స్పందించింది. కెనడాపై భారత్ వేర్పాటు వాదులను పెంచిపోషిస్తున్నారని మండింది. ఇటీవల జరిగిన జీ 20 సమావేశాల్లోనూ భారత్ కెనడా తీరుపై అసంతృప్తి వ్యక్తంచేసింది. సోమవారం నాడు కెనడ ప్రధాని చేసిన వ్యాఖ్యలు భారత్‌ను ఆగ్రహానికి గురిచేసేంది. వెంటనే ఆదేశ హైకమిషనర్‌ను పిలిపించింది. ఆ తరువాత కెనడాకు చెందిన దౌత్యవేత్తను బహిష్కరించింది. ఐదు రోజుల్లో భారత్ విడిచి వెళ్లాలని సూచించింది.
చదవండి ఇవికూడా
భర్తను చంపింది… తొమ్మిందేండ్లకు దొరికింది.. ఇన్నాళ్లు ఆరా తీయలేదా…
ఆకతాయిలపై పోలీసుల కాల్పులు.. ఆడవాళ్లను వేధిస్తే యముడు వెంటే