Asteroid” అంతరిక్షంలో తిరుగుతున్న ఆస్టరాయిడ్ అపోఫిస్
ఇస్రో చైర్మన్ సోమనాథ్ వెల్లడి
ఆస్టరాయిడ్స్ గురించి మీరు వినే ఉంటారు. ఆస్టరాయిడ్స్‌ను తెలుగులో గ్రహశకలాలుగా పిలుస్తారు. ఈ సుదీర్ఘంగా అంతరిక్షంలో గ్రహశకలాలు ఎన్నో తిరుగుతున్నాయి.. ఒక భారీ గ్రహశకలం భూమిని ఢీ కొనే భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (Isro) ‘ఇస్రో’ శాస్త్రవేత్తలు తెలిపారు. ఆ ఆస్టరాయిడ్ (earth) భూమిని ఢీకొంటే భూగ్రహంపై భారీ ప్రమాదం చోటు చేసుకునే అవకాశం ఉందని వారు పేర్కొన్నారు. ఆ గ్రహశకలంపై పై ఇస్రో పరిశోధన చేస్తున్నట్టు చెప్పారు. ఇందుకు సంబంధించిన వివరాలను ఇస్రో చైర్మన్ ఎస్. సోమనాథ్ తాజాగా వెల్లడించారు. అంతరిక్షంలో తిరుగుతున్న ఆస్టరాయిడ్ పేరు అపోఫిస్ .. రోబోయే రోజుల్లో (earth) భూమికి అత్యంత సమీపంగా వచ్చే అవకాశం ఉందని ఇస్రో సైంటిస్టులు గుర్తించారు. దాని పొడవు సుమారు 450 మీటర్లు, వెడప్పు 170 మీటర్లు ఉన్నట్టు కనుగొన్నారు. ఈ ఆస్టరాయిడ్ 2029వ ఏడాది ఏప్రిల్ 13న భూమికి అత్యంత దగ్గరగా వస్తుందని తెలిపారు. కేవలం 32 వేల కిలోమీటర్ల సమీపం నుంచే దూసుకువెళ్లన్నట్టు తేల్చారు. భూమి చుట్టూ స్థిర కక్ష్యలో తిరిగే కమ్యూనికేషన్ శాటిలైట్ల కంటే కూడా ఇది దగ్గరగా వస్తుండడం గమనార్హం. అపోఫిస్ మన యుద్ధనౌక ఐఎన్‌ఎస్ విక్రమాదిత్య కంటే పెద్దదని ఇస్రో చైర్మన్ సోమనాథ్ తెలిపారు. అపోఫిస్ భూమిని ఢీ కొడితే తర్వాత పరిస్థితులు, దాని గమనం, ఇతర అంశాలపై(Isro) ఇస్రోలోని నెట్ వర్క్ ఫర్ స్పేస్ ఆబ్జెక్ట్ ట్రాకింగ్ అండ్ అనాలసిస్ విభాగం ఆధ్వర్యంలో పరిశోధన చేస్తున్నట్టు తెలిపారు. ఈ క్రమంలో (Nasa) నాసాకు చెందిన ఒసిరిస్ ఆర్‌ఈఎక్స్, యూరోపియన్ స్పేస్ ఏజెన్సీకి చెందిన రామ్సెస్ విభాగాలతో ఆస్టరాయిడ్లపై పరిశోధనలో కలసి ముందుకువెళుతున్నట్టు వివరించారు.
ఇవి కూడా చదవండి
HONOR 5G Phones” హానర్ స్మార్ట్ ఫోన్లపై భారీ తగ్గింపు.. 16 వ తేది వరకే తగ్గింపు
HONOR 5G Phones” హానర్ స్మార్ట్ ఫోన్లపై భారీ తగ్గింపు.. 16 వ తేది వరకే తగ్గింపు
Noise Buds” నాయిస్ బడ్స్ కేవలం 1199 రూపాయలకే..