Wednesday , 18 December 2024

Bleeding eye virus” భ‌య‌పెడుతున్న ‘బ్లీడింగ్‌ ఐ వైరస్‌’

Bleeding eye virus” మ‌రోసారి ప్రపంచ దేశాలు ‘బ్లీడింగ్‌ ఐ వైరస్‌’ మహమ్మారికి గజగజ వణకుతున్నాయి. ప్రస్తుతం ఆఫ్రికాను వేధిస్తున్న ఈ వైరస్‌ అక్కడి నైరుతి కాంగోలో తొలిసారి బయటపడింది. ఈ అంతుచిక్కని వ్యాధి కాంగోలోని క్వాంగో ప్రావిన్సులో మారణహోమాన్ని సృష్టిస్తుంది. కేవలం 15 రోజుల్లో దాదాపు 150 మందిని పొట్టనబెట్టుకుంది. దీంతో ఆ దేశ ఆరోగ్య అధికారులు హెల్త్‌ ఎమర్జెన్సీ జారీ చేశారు. నవంబర్‌ 10 నుంచి నవంబర్‌ 25 మధ్య కాంగో ప్రావిన్స్‌లోని పాంజీ హెల్త్‌ జోన్‌లో ఈ మరణాలు సంభవించాయి. అంతుచిక్కని మరణాలను గల కారణాలను అన్వేషించడానికి రోగుల నుంచి నమూనాలు సేకరించేందుకు ఒక వైద్య బృందం పాంజీ హెల్త్‌ జోన్ కు చేరుకుంది. అక్కడి ప్రాంతీయ ఆరోగ్య మంత్రి అపోలినైర్‌ యుంబా ప్రకారం. దీని అనారోగ్య లక్షణాలు ఫ్లూ ని పోలి ఉన్నట్లు తెలిపారు. రోగుల్లో అధిక జ్వరం, తీవ్రమైన తలనొప్పి, దగ్గు, రక్తహీనత వంటి లక్షణాలు కనిపిస్తున్నాయి. దీనికి చికిత్స అందుబాటులో లేకపోవడంతో అనేక మంది రోగులు తమ ఇళ్లలోనే మృతి చెందుతున్నారు. డెమొక్రాటిక్‌ రిపబ్లిక్‌ ఆఫ్‌ కాంగోలోని ఆరోగ్య అధికారులు సమస్యాత్మక ప్రదేశాల్లో జనాల అనారోగ్యంపై నిఘా ఉంచారు. ఇది అంటువ్యాధని, మృత దేహాల దరిదాపుల్లోకి కూడా ఎవ్వరూ రావొద్దంటూ అక్కడి ప్రజలకు హెచ్చరికలు జారీ చేశారు. ఇక్కడి ఆరోగ్య సమస్యను పరిష్కరించడానికి, వైద్య సామాగ్రిని సరఫరా చేయాలని ఆరోగ్య మంత్రి అపోలినైర్‌ యుంబా దేశీయ, విదేశీ భాగస్వాముల సహాయం కోరారు. రోగుల సంఖ్య పెరుగుతూనే ఉంది. పరిస్థితి చాలా ఆందోళనకరంగా ఉంది. స్థానిక ఎపిడెమియాలజీ ప్రకారం, ఈ వ్యాధి మహిళలు, పిల్లలను తీవ్రంగా ప్రభావితం చేస్తున్నట్లు పేర్కొంది. మరణాల సంఖ్య వేగంగా పెరుగుతోందని, ఒక్క నవంబర్‌ 25వ తేదీన దాదాపు 67 మరణాలు నమోదైనట్లు అక్కడి ఆరోగ్య అధికారులు వెల్లడించారు. కాంగోలో విజృంభిస్తున్న ఈ కొత్త వైరస్‌ను కట్టడి చేయకుంటే మరోమారు ప్రమాదం ముంచుకొచ్చే అవకాశం ఉందని ప్రపంచదేశాలు ఆందోళన చెందుతున్నాయి. మ‌రిన్ని ఆస‌క్తిక‌ర క‌థ‌నాల కోసం మ చానెల్ ను స‌బ్ స్క్రైబ్ చేసుకోండి..

 

మ‌రెన్నో ఇంట్ర‌స్టింగ్ క‌థ‌నాల కోసం ఈ లింక్ ను క్లిక్ చేయండి… https://whatsapp.com/channel/0029VaBklCu6xCST8YUVgT00

 

ఇవి కూడా చ‌ద‌వండి

Boat Smart Watch” బోట్ లూనార్ పీక్ స్మార్ట్ వాచ్.. అమెజాన్‌లో

Asteroid” భూమికి స‌మీపంగా ఆస్ట‌రాయిడ్‌..?

Sony TV” సోనీ 139 సెం.మీ (55 ఇంచుల‌) బ్రావియా 2 4K అల్ట్రా హెచ్‌డీ స్మార్ట్ ఎల్ఈడీ టీవీ

HONOR 5G Phones” హాన‌ర్ స్మార్ట్ ఫోన్ల‌పై భారీ త‌గ్గింపు.. 16 వ తేది వ‌ర‌కే త‌గ్గింపు

Noise Buds” నాయిస్ బ‌డ్స్ కేవ‌లం 1199 రూపాయ‌ల‌కే..

BorderGavaskarTrophy ” ఆట మ‌ధ్య‌లో ఫ్ల‌డ్ లైట్ల ఆట

Karimnagar news” చ‌ట్టాల‌పై అవ‌గాహ‌న పెంచుకోవాలి: సీనియర్ సివిల్ జడ్జి కే వెంకటేష్

iq-5g-phone” ఐ క్యూ 5 జీ ఫోన్ కేవ‌లం రూ. 13,999 కే.. అందుకోండి అమెజాన్‌లో

Noise Buds” నాయిస్ బ‌డ్స్ కేవ‌లం 1199 రూపాయ‌ల‌కే..

Up Road Accident” రెండు ఘోర రోడ్డు ప్ర‌మాదాలు. 10మంది మృతి

 

About Dc Telugu

Check Also

18.12.2024 D.C Telugu

Apple MacBook

Apple MacBook ” యాపిల్ మాక్‌బుక్ ₹56,990.. బుక్ చేయండి ఇప్పుడే..

Apple MacBook ” అద్బుత‌మైన ఆపిల్ మాక్ బుక్ స‌ర‌స‌మైన ధ‌ర‌లో ..అమెజాన్‌లో బుక్ చేయండి.. రోజంతా బ్యాటరీ లైఫ్ …

TCL TV

TCL TV” టీసీఎల్ 55 ఇంచుల టీవీ.. రెండు సంవ‌త్స‌రాల వారంటీతో.. ₹37,990

TCL TV”  త‌క్కువ ధ‌ర‌లో మంచి కంపెనీ టీవీని కొనాల‌నుకుంటున్నారా..? అయితే టీసీఎల్ నుంచి మంచి టీవీ మీ ముందుకొచ్చింది. …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Social Media Auto Publish Powered By : XYZScripts.com