SHOCKING News” బిజీగా ఉన్న సూపర్ మార్కెట్ లో ఓ మహిళ షాపింగ్ చేస్తున్న క్రమంలో జేబులో సెల్ ఫోన్ పేలిపోయింది. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.
వివరాల్లోకి వెళ్తే.. శనివారం బ్రెజిల్ లోని అనపోలిస్ నగరంలోని దుకాణంలో ఓ మహిళ తన భర్త పక్కన ఉండి వస్తువులను బ్రౌజ్ చేస్తున్నది.
ఈ క్రమంలో తన వెనక జేబులో (పాకెట్)లో ఉన్న సెల్‌ఫోన్ ఒక్కసారిగా పేలిపోయింది. ఈ ఘటనతో ఆమె ఒక్కసారిగా భయాందోళనకు గురయింది. షాపింగ్ మాల్‌లో ఉన్న వారు కూడా భయపడ్డారు.
తన భర్త మంటలను ఆర్పడానికి ప్రయత్నిస్తున్నట్లు కనిపించడంతో ఆ మహిళ అటుఇటు పరుగెత్తింది. ఆ తరువాత దుకాణం నుండి బయటకు పరిగెత్తింది.
వీధిలో బయటకు వెళ్లడంతో పక్కనే ఉన్నవారు ఆమెకు సహాయం చేయడానికి ముందుకు వచ్చారు.
ఆమె భర్త మాటియస్ లిమా బ్రెజిలియన్ మంటలను ఆర్పడానికి తన చొక్కా తీసేశానని చెప్పారు.
మంటలు ఆరిపోయాక ఆమెను ఆల్ఫ్రెడో అబ్రానో దవాఖానాకు తరలించారు. ఆమె చేయి, ముంజేయి, వీపు మరియు వెనకభాగాలకు కాలిన గాయాలయ్యాయి.
ఆమె జుట్టులో కూడా కొంత భాగం కాలిపోయింది. ఆమె గాయాలకు చికిత్స కోసం ఆసుపత్రికి తిరిగి వెళ్లాల్సి ఉంది.
ఆమె భర్త లిమా మాట్లాడుతూ.. ఒక సంవత్సరం క్రితం ఓ కంపెనీకి చెందిన
ఫోన్ వెనుక భాగం పేలిపోయే కొద్ది క్షణాల ముందు ఆమెకు సిర్‌సిర్’ శబ్దం వినిపించింది. ఆమె స్వెట్‌షర్ట్ కాలిపోయి ఆమె చేతిపై చిన్న చిన్న కాలిన గాయాలు అయ్యాయి.
SHOCKING: మహిళ ప్యాంట్లో పేలిన సెల్‌ఫోన్
బ్రెజిల్లో చోటు చేసుకున్న ఘటన
భర్తతో కలిసి సూపర్ మార్కెట్లో షాపింగ్ చేస్తుండగా.. ఆమె వెనక పాకెట్లో ఒక్కసారిగా పేలిన ఫోన్
ఈ ప్రమాదంలో ఆమె వెనుక భాగం, చేతులకు తీవ్ర గాయాలు
సీసీటీవీ కెమెరాల్లో రికార్డయిన దృశ్యాలు pic.twitter.com/VwSphy6ExR
— Swathi Reddy (@Swathireddytdp) February 12, 2025
ఇవి కూడా చదవండి
Indiapostal Jobs” పోస్ట్ ఆఫీస్ లో 10 వ తరగతి అర్హతతో 21,413 ఖాళీల భర్తీ..
Amazon Offer” ది పర్ఫెక్ట్ టీవీ డేట్.. టీవీలపై ఆమెజాన్ ఆఫర్ల ధమాకా
Bank jobs” సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో క్రెడిట్ ఆఫీసర్స్.. 1000 ఖాళీలు
OnePlus Nord CE4″ వనప్లస్ నార్డ్ సీఈ 4 స్మార్ట్ ఫోన్ … వాలెంటైన్స్ డే స్పెషల్ ఆఫర్‌తో..
Realme Phones” రియల్ మీ వాలెంటైన్స్ డే.. అదిరిపోయే ఆఫర్లతో రియల్ మీ ఫోన్లు..