మృత్యువు ఎప్పుడు.. ఎవరికి.. ఏ రూపంలో వస్తుందో ఎవరూ ఊహించలేం. అటువంటి ఘటనే రంగారెడ్డి జిల్లాలో బుధవారం రాత్రి చోటు చేసుకుంది. అప్పటివరకూ స్నేహితునితో సరదాగా పార్టీ చేసుకున్న ఆ వ్యక్తి ఒక్కసారిగా ఊపిరాడక మృతి చెందాడు. పార్టీలో తిన్న చికెన్ సదరు వ్యక్తి ప్రాణం తీసింది. ఝార్ఖంఢ్ రాష్టాన్రికి చెందిన జితేంద్ర కుమార్ వర్మ, ధర్మేందర్ తివారీ కొంతకాలంగా రంగారెడ్డి జిల్లా ఫరూఖ్ నగర్ మండలం ఎలికట్ట గ్రామంలో ఇల్లు అద్దెకు తీసుకుని నివాసం ఉంటున్నారు. వీరిద్దరూ బుధవారం రాత్రి దావత్ చేసుకున్నారు. చికెన్, పూరీ వండుకున్నారు. మద్యం సేవించి భోజనం చేస్తుండగా.. జితేంద్రకుమార్ ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. ఇది చూసిన ధర్మేందర్ కు ఏం జరిగిందో అర్థం కాలేదు. మద్యం ఎక్కువగా తాగి ఉంటాడని, అందుకే స్పృహ కోల్పోయి ఉంటాడని భావించాడు. కాసేపటి తర్వాత అనుమానంతో జితేందర్ శ్వాస తీసుకోవడం లేదని గ్రహించిన ధర్మేందర్ అతన్ని వెంటనే ఆస్పత్రికి తరలించాడు. పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు నిర్దారించారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిర్వహించగా.. గొంతులో చికెన్ ముక్క ఇరుక్కోవడంతో జితేందర్ మృతి చెందినట్లు వైద్యులు నిర్దారించారు. ఘటనపై ధర్మేందర్ తివారీ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Check Also
Viral Video” అదిరందయ్యా.. లేటెస్ట్ గుర్రపు కాదు.. కాదు బైక్ స్వారీ.. వీడియో వైరల్
Viral Video” ద్విచక్రవాహనాలు, ఆటోలు, జీపులు రాకముందు మనుషులు రవాణా కోసం గుర్రపు బండ్లను ఉపయోగించారు. సాంకేతికత పెరిగినంకా గుర్రపు …
Xiaomi Power Bank” మీరు మంచి పవర్ బ్యాంక్ కోసం చూస్తున్నారా..? 45 శాతం తగ్గింపుతో.. జియోమీ పవర్ బ్యాంక్
Xiaomi Power Bank” ఫోన్ అవసరాలు ఎక్కువగా ఉన్నవారు మంచి పవర్ బ్యాంక్‌ల కోసం చూస్తుంటారు. జియోమి నుంచి మంచి …
Xiaomi Tv” 42999 రూపాయల విలగల జియోమీ108 సె.మీ ల టీవీ రూ. 26,999 .. ఈ రోజే చివరి రోజు
Xiaomi Tv” ప్రస్తుతం అమెజాన్‌లో ఎలక్ట్రానిక్ ఫెస్టివ్ సేల్ నడుస్తోంది. ఎన్నో ఎలక్ట్రానిక్ వస్తువులపై భారీ తగ్గింపు ప్రకటించింది. మీరు …