Drunk and drive” ఎస్సై శేఖర్ రెడ్డి…
శంకరపట్నం డిసి ప్రతినిధి…
డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో పట్టుబడిన వ్యక్తులకు హుజురాబాద్ స్పెషల్ జ్యుడీషియల్ మెజిస్ట్రేట్ సెకండ్ క్లాస్ జరిమానా విధించినట్లు కేశవపట్నం ఎస్ఐ కట్కూరి శేఖర్ రెడ్డి బుధవారం తెలిపారు. ఈ సందర్భంగా ఎస్ఐ శేఖర్ రెడ్డి పూర్తి వివరాలను వెల్లడించారు. కరీంనగర్ జిల్లా మానకొండూరు నియోజకవర్గం శంకరపట్నం మండలంలో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ప్రజల రక్షణ కోసం నిర్వహించిన తనిఖీల్లో భాగంగా మద్యము సేవించి వాహనాలు నడిపిన వ్యక్తులు కేశవపట్నం పోలీసుల తనిఖీల్లో పట్టుబడగా అట్టి వ్యక్తులను హుజురాబాద్ స్పెషల్ జ్యుడీషియల్ మెజిస్ట్రేట్ సెకండ్ క్లాస్ ముందు10 మందిని హాజరు పరచగా మెజిస్ట్రేట్ 11 వేల రూపాయల జరిమానా విధించినట్లు పేర్కొన్నారు. మద్యం సేవించి వాహనాలు నడిపితే కఠిన చర్యలు తప్పవని ఎస్ఐ శేఖర్ రెడ్డి వాహనదారులను హెచ్చరించారు.
Srisailam Dam” శ్రీశైలం డ్యాం గేట్స్ ఓపెన్ అద్భుతమైన దృశ్యాల్ని అందించిన డ్రోన్ వీడియో
Nimisha Priya” భారతీయ నర్సుకు యెమెన్లో జూలై 16న ఉరిశిక్ష అమలు కారణమిదే..
