cold” తెలంగాణ రాష్ట్రంలో చలి తీవ్రత కొనసాగుతోంది. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు సింగిల్ డిజిట్‌కే పరిమితమవుతున్నాయి. ఈవినింగ్ 5 గంటల నుంచే చలి పంజావిసురుతోంది. ఇక పొద్దుగాల 10 గంటల దాకా చలి తగ్గడం లేదు. దీంతో జనాలు ఇళ్ల నుంచి బయటకు రావాడానికే భయపడుతున్నారు. ఇంకో రెండు రోజులు ఇలాగే చలి తీవ్రత ఉంటుందని వాతావరణ అధికారులు చెప్పుతున్నారు. ముఖ్యంగా ఆదిలాబాద్, ఆసిఫాబాద్, కుమురంభీం, నిర్మల్, సంగారెడ్డి, మెదక్, మంచిర్యాల, జిల్లాల్లో ఉష్ణోగ్రతలు కనిష్టానికి పడిపోతాయని తెలిపారు. రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో 6.2 డిగ్రీలకు ఉష్ణోగ్రతలు పడిపోయాయి. చాలా ప్రాంతాల్లో 7 డిగ్రీల మేర కనిష్ఠంగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
రాష్ట్ర వ్యాప్తంగా మంగళవారం నమోదైన ఉష్ణోగ్రతలు
పటాన్‌చెరులో 7 డిగ్రీలు,
మెదక్‌లో 7.5
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా భీంపూర్‌లో అత్యల్పంగా 6.3 డిగ్రీల సెల్సియస్
నిర్మల్ జిల్లా తాండ్రలో 6.6,
కుమ్రంభీం ఆసిఫాబాద్‌లో 6.7,
సంగారెడ్డి 6.8,
కామారెడ్డి 7.6,
నిజామాబాద్ 7.7,
మెదక్ 8,
జగిత్యాల 8,
వికారాబాద్ 8.2,
రాజన్నసిరిసిల్ల 8.6,
సిద్దిపేట 8.6,
రంగారెడ్డి 8.9,
పెద్దపల్లిలో 9.5
డిగ్రీల చొప్పున ఉష్ణోగ్రతలు నమోదైనట్టు వాతావరణశాఖ వెల్లడించింది.
Check Also
lunch box” చిన్నపిల్లల లంచ్ బాక్స్.. కేవలం 125 మాత్రమే
lunch box” మంచి చిన్న పిల్లల లంచ్ బాక్స్ కోసం చూస్తున్నారా..? అయితే మింత్రలో ఉంది. కేవలం 125 మాత్రమే. …
Sony BRAVIA TV” సోనీ బ్రావియా 2 సిరీస్ 43 ఇంచుల టీవీ ₹39,990
Sony BRAVIA TV” సోనీ కంపెనీలో తక్కువ ధరలో చూస్తున్నారా..? కేవలం ₹39,990లకే బ్రావియా 2 సీరిస్‌లో ఎల్ ఈడీ …
Lava Smart Phones” లావా స్మార్ట్ ఫోన్లు.. రూ. 5 వేల నుంచి రూ. 20 వేల లోపు.. డెబిట్ కార్డులపై రూ. 2 వేలు తగ్గింపు..
Lava Smart Phones” లావా స్మార్ట్ ఫోన్లపై భారీ తగ్గింపు నడుస్తున్నది. హెడీఎఫ్‌సీ డెబిట్ కార్డుపై రూ. 2 వేలు …