Delhi viral News” పురోహితులు, వధువు, వరుడు కళ్యాణమండపానికి చేరుకున్నారు. అతిథులు కూడా వచ్చారు. అంగరంగ వైభవంగా లగ్గం జరుగుతోంది. పీటల మీద పెండ్లి కూతరు, పెండ్లికొడుకు సంబురంగా వేడుకలో నిమగ్నమయ్యారు. కానీ పెండ్లి కొడుకు చేసిన పిచ్చి పనికి వివాహం క్యాన్సిల్ అయ్యింది. ఇంతకీ ఏంచేశాడు. ఏమిటీ ఆ కథ తెలుసుకుందాం పదండి…
దేశరాజధాని ఢిల్లీలోని సాహిబాబాద్ లోని ఓ కళ్యాణమండంలో పెండ్లి జరుగుతున్నది. సాహిబాబాద్‌లోని షాహీద్ నగర్‌లో నివసిస్తున్న అమ్మాయికి ఢిల్లీలోని గాంధీనగర్‌లో నివసిస్తున్న అబ్బాయితో వివాహం ఖాయమైంది. షాహిద్ నగర్ లోని ఓ కళ్యాణ మండపానికి చేరుకున్నారు. వధూవరులిద్దరూ వేదికపై ఆసీనులయ్యారు. పూలదండలు కూడా మార్చుకున్నారు. ఇంతలో పెండ్లికొడుకు వాష్ రూం వెళ్లి వచ్చాడు. కొద్దిసేపటికి మళ్లీ వాష్ రూంకి వెళ్లాడు. ఇలా వెంటవెంటనే పలుమార్లు వెళ్లాడు. దీనిపై అనుమానం వచ్చిన వధువు ఎందుకు వెళ్తున్నాడో తెలుసుకోవాలని తమ కుటుంబీకులకు సైగ చేసింది. వెంటనే వధువు తరుపు వారు పెండ్లి కొడుకును ఫాలో అయ్యారు. వాష్ రూం కి అని చెప్పి వెళ్లిన వరుడు చేసే పని చూసి ఖంగుతిన్నారు. వాష్ రూం పేర వెళ్లిన వరుడు వేదిక వెనకాల మద్యం సేవిస్తూ వచ్చాడు. దీంతో వధువు పెండ్లి చేసుకోనని తెగేసి చెప్పింది. పూలదండ విసిరి కొట్టింది. దీంతో ఇరు వర్గాల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఒకరిని ఒకరు తిట్టుకున్నారు. అంతటితో ఆగకుండా కొట్టుకున్నారు. పోలీస్‌స్టేషన్లో ఫిర్యాదు కూడా చేసుకున్నారు. పెండ్లి కొడుకు చేసిన పిచ్చి పనికి వివాహం రద్దుకు కారణమయ్యింది.
Power Bank”1099 రూపాయలకే అమెజాన్ బ్రాండ్ పవర్ బ్యాంక్
Nova Water Heater” నోవా వాటర్ హీటర్.. సంవత్సరం వారంటీ.. షాక్ ఫ్రూఫ్
Cleaning Mop”మార్సూన్ మాప్… 10 సంవత్సరాల వారంటీతో.. ఇక సులభంగా తుడవొచ్చు..
House Viral Video” ఇదేందయ్యా స్వామి.. ఇళ్లు ఇలా కట్టావ్.. వీడియో వైరల్
Red MI 5G Phone” 8 వేలల్లో రెడ్‌మీ 5 జీ ఫోన్.. ఇప్పుడే బుక్ చేయండి అమెజాన్‌లో
Social Media” పిల్లలకు సోషల్‌మీడియా నిషేధం.. లేకపోతే 280 కోట్ల జరిమానా..