elephant attacked” చాలా మంది అంటుంటారు నేను చావు అంచులదాకా వెళ్లి బయటకొచ్చిన అని. ఇంకొక సందర్భంలో నాకు భూమ్మీద నూకలున్నాయి కాబట్టే ఇంకా బతికి ఉన్నా లేకుంటే ఇప్పటికే నా ప్రాణం గాలిలో కలిసిపోయేదని.. ఇటువంటి మాటలు తరుచూ వింటుంటాం కానీ ప్రత్యక్ష చూడడం అరుదు. ఇప్పుడంటే సీసీ కెమెరాల్లో కొన్ని రికార్డు అవుతున్నాయి కాబట్టి చూడగల్గుతున్నాం. కొంతమంది ప్రమాదం జరిగిటప్పుడు కూడా ఫోన్లలో రికార్డులను చూస్తున్నాం. అటువంటి ఘటనే ఒకటి బందీపూర్-వయనాడు జాతీయ రహదారిలో చోటు చోసుకుంది. వాహనదారులిద్దరు రోడ్డుపై పరుగెడుతుండగా వారి వెనకాలే ఓ ఏనుగు వారిపై దాడి చేసేందుకు ఆగ్రహంతో వెంటపడింది. వారి ముందు ఓ కారు కూడా స్లోగా వెళ్తుంది. ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని పరుగులు పెడుతున్నవారిని చూస్తున్న వారు కేకలు పెట్టారు. ఓ దశలో ఒక వ్యక్తి కిందపడిపోయాడు. ఏనుగు అతని దగ్గరి వెళ్ళి చూసి ఏమనకుండా వెళ్లిపోవడం గమనార్హం. ఆ వ్యక్తి బతికితినిరా అంటూ అడవిలోకి పాకుతూ వెళ్తుండడం వీడియోలో చూడొచ్చు. భూమ్మీద నూకలుండటం అంటే ఇదేనేమో అంటూ నెటిజన్లు కామెంట్ పెడుతున్నారు.
బందీపూర్-వయనాడు జాతీయ రహదారిలో వాహనదారులపై దాడి చేసిన ఏనుగు
వెంట్రుకవాసిలో తప్పించుకున్న వ్యక్తి pic.twitter.com/BP26YfllP5
— Telugu Scribe (@TeluguScribe) February 2, 2024
Ts Rtc ” వారిపై కఠిన చర్యలు ప్రయాణికులకు టీఎస్‌ఆర్టీసీ హెచ్చరిక