Nagar kurnool news” ఘోర విషాదం… మట్టి ఇల్లు కూలి ఒకే ఇంట్లో నలుగురు మృతి

Nagar kurnool news

Nagar kurnool news”  నాగ‌ర్ క‌ర్నూల్ జిల్లాలో ఘోర విషాదం చోటు చేసుకుంది. మ‌ట్టిఇల్లు కూల‌డంతో ఒకే ఇంట్లో ఉన్న న‌లుగురు మృతి చెందారు. వివ‌రాల్లోకి వెళ్తే.. నాగర్ కర్నూలు జిల్లాలోని నాగ‌ర్ క‌ర్నూల్ మండ‌లంలోని – వనపట్ల ఊరుకు చెందిన గొడుగు భాస్కర్ ఆటో న‌డుపుతూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. భాస్కర్ భార్య పద్మ, కూతుళ్లు వసంత(7), పప్పి (6), కొడుకు విక్కీ(15 నెలలు) ఐదుగురు ఆదివారం రాత్రి ఇంట్లో ప‌డుకున్నారు. ఆదివారం రాత్రి కురిసిన వాన‌కు ఇల్లు కూలి నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు. భాస్కర్ పరిస్థితి విషమంగా ఉంది. భాస్క‌ర్‌ను ఆస్ప‌త్రికి త‌ర‌లించి చికిత్స చేయిస్తున్నారు. స‌మాచారం అందుకున్న పోలీసులు ఘ‌ట‌నా స్థలానికి చేరుకుని వివ‌రాలు సేక‌రించారు. కేసు ద‌ర్యాప్తు చేస్తున్నారు.

 

ఇవి కూడా చ‌ద‌వండి

Viral video” స‌ముద్రంలో ఇరుక్కున్న థార్స్‌… రీల్స్ కోస‌మేనా..?  వైర‌ల్ వీడియో

Vikarabad News” చ‌నిపోయాడ‌ని అంత్య‌క్రియ‌ల‌కు ఏర్పాట్లు.. అంత‌లోనే తిరిగొచ్చిన ఆ వ్యక్తి.. అంద‌రూ షాక్

Bapatla Beach” విషాదంగా విహార యాత్ర‌.. సముద్రంలో ఇద్ద‌రు మృతి.. న‌లుగురు యువకులు గ‌ల్లంతు

Hajj Pilgrimage” హజ్‌ యాత్రలో విషాదం.. ఎండ వేడికి 1000కి పైగా మృతి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *