Gangadhara news” మా ఊరి మహాలక్ష్మి ఫౌండేషన్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో 2023 లో జన్మించిన 5 మంది ఆడ పాపలకు. తండ్రిని కోల్పోయిన ఇద్దరు ఆడపాపలకు ఒక్కొక్కకరికీ రూ.10,116/- చొప్పున ట్రస్ట్ ఫౌండర్ రేండ్ల పద్మ శ్రీనివాస్ ఆధ్వర్యంలో పంపిణి చేశారు. ఈ కార్యక్రమాన్ని కరీంనగర్ జిల్లా గంగాధర మండలం కొండాయపల్లిలో సోమవారం ఏర్పాటు చేశారు. ఫౌండేషన్ అధ్యక్షురాలు గోవిందమ్మ, కార్యవర్గం చేతుల మీదుగా సుకన్య సమృద్ధి యోజనలో ఫిక్స్ డిపాజిట్ చేసి పిల్లల తల్లిదండ్రులకు పాస్ బుక్కులు అందజేశారు. ఫౌండేషన్ వారు రూ.5116 తల్లి దండ్రులు రూ. 5000 మొత్తంగా రూ.10,116 ఖాతాలో జమ చేశారు. తండ్రిని కోల్పోయిన ఇద్దరు ఆడబిడ్డలకు చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం రూ. 10వేలు అందించారు. 2023 లో జన్మించిన ఐదుగురు ఆడ పాపలకు,తండ్రిని కోల్పోయిన ఆడబిడ్డలకు రూ.20వేలు మొత్తంగా రేండ్ల పద్మశ్రీనివాస్‌లు 45,812 వేల రూపాయలు అందించి తమ దాతృత్వాన్ని చాటుకున్నారు. ఈ సందర్బంగా ట్రస్ట్ సభ్యులు మాట్లడారు. ఆడపిల్లలకు సహాయం చేయాలనే ఉద్దేశ్యంతో 2018 లో మా ఊరి మహాలక్ష్మి అనే ట్రస్ట్ ను స్థాపించినట్టు తెలిపారు. ఈ 7 ఏండ్లలో తమ కొండాయపల్లి గ్రామంలో పుట్టిన పుట్టిన ప్రతి బిడ్డకు ఈ సహాయం అందజేసినట్టు వివరించారు. ఇప్పటి వరకు 54 మందితో ఆడపిల్లలకు(చిన్నారులకు) అందజేశామన్నారు. వీరితో పాటు తండ్రిని కోల్పోయిన మరో ఐదుగురికి సహాయం అందించామన్నారు. మున్ముందు ఎక్కువ దాతల సహకారం ఉన్నట్లయితే ఎక్కువ అమౌంట్ తో పాటు ఆడపిల్లలకు ఆర్థిక భరోసా, ఆత్మస్థైర్యం ఇచ్చేలా ప్రణాళిక బద్ధమైన కార్యక్రమాలు చేయగలమని ఆశాభావం వ్యక్తం చేశారు. ఫౌండేషన్ వ్యవస్థాపకులు రేండ్ల పద్మ శ్రీనివాస్‌లను చిన్నారుల తల్లిదండ్రులు,గ్రామస్తులు అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో వ్యవస్తాపకులు రేండ్ల పద్మ శ్రీనివాస్, కార్యవర్గ సభ్యులు గ్రామ ప్రజలు పాల్గొన్నారు.
ర్యాపిడ్ హీటింగ్ కాయిల్ టెక్నాలజీతో నోవా వాటర్ హీటర్ 2000W షాక్ ప్రూఫ్ ఇమ్మర్షన్ రాడ్ | అదనపు పొడవాటి వైర్‌తో రాగి & నికెల్ పూత పూయబడింది..
ఈ వాటర్ హీటర్ ను అమెజాన్లో కొనుగోలు చేసేందుకు ఈ లింక్ ను క్లిక్ చేయండి.. https://amzn.to/3AYTYvg
అందమైన మహిళల బ్యాగును అమెజాన్‌లో కొనేందుకు ఈ లింక్ ను క్లిక్ చేయండి.. https://amzn.to/4gfQ4ge
ఇవి కూడా చదవండి
Social Media” పిల్లలకు సోషల్‌మీడియా నిషేధం.. లేకపోతే 280 కోట్ల జరిమానా..
House Viral Video” ఇదేందయ్యా స్వామి.. ఇళ్లు ఇలా కట్టావ్.. వీడియో వైరల్