Wednesday , 17 July 2024

పోలింగ్ నాడు అంద‌రికీ సెలవు … ప్రభుత్వ,ప్రైవేట్‌ సంస్థలు విధిగా సెలవు ఇవ్వాలి

తెలంగాణలో ఎన్నిక‌ల‌కు రంగం సిద్ధమైంది. గురువారం (నవంబర్ 30) న తెలంగాణ వ్యాప్తంగా ఎన్నికలు జరగనున్నాయి. ఈ క్ర‌మంలో 30వ తారీఖున రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలు, ఐటీ కంపెనీలు సెలవు ప్రకటించాలని ఎన్నికల ప్రధాన అధికారి ఆదేశాలు జారీ చేశారు. అన్ని కార్యాలయాల్లో పనిచేసే ఉద్యోగులు తప్పనిసరిగా ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఆయా సంస్థలు సెలవు ఇవ్వాని సూచించారు. సెలవు ఇవ్వని సంస్థలపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. గతంలో ఎన్నికల జ‌రిగిన‌ప్పుడు కొన్ని సంస్థలు సెలవు ఇవ్వ‌లేద‌ని తమకు ఫిర్యాదులు అందినట్లు సీఈవో తెలిపారు. ఈ ఎన్నికలకు అన్ని సంస్థలు సెలవు ఇచ్చాయో లేదో పరిశీలించాలని కార్మిక శాఖకు ఆదేశాలు జారీ చేశారు.

మరోవైపు ఎన్నికల దృష్ట్యా హైదరాబాద్‌ నగరంలోని అన్ని విద్యాసంస్థలకు రెండు రోజులు సెలవు ప్రకటించిన విషయం తెలిసిందే. బుధ, గురువారాల్లో జిల్లా పరిధిలోని అన్ని విద్యాసంస్థలకు సెలవు ప్రకటిస్తూ హైదరాబాద్‌ జిల్లా కలెక్టర్‌ అనుదీప్‌ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. నవంబర్‌ 30వ తేదీన తెలంగాణ అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్నాయి. ఈ రోజున అంతా ఓటు హక్కు వినియోగించుకోవాలని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వికాస్‌ రాజ్‌ సూచించారు. ఎన్నికలు జరిగే రోజున తెలంగాణలోని అన్ని ప్రైవేటు సంస్థలు, ఐటీ కంపెనీలు సెలవు ప్రకటించాలని సీఈవో వికాస్‌ రాజ్‌ ఆదేశాలు జారీ చేశారు. ఉద్యోగులు ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఆ కంపెనీలు హాలిడే ప్రకటించాలన్నారు. సెలవు ఇవ్వని సంస్థలు, కంపెనీలపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని ఓ ప్రకటనలో పేర్కొన్నారు. తంలో జరిగిన ఎన్నికల్లో కొన్ని ఐటీ, ప్రైవేట్‌ కంపెనీలు సెలవు ఇవ్వలేదని తమకు ఫిర్యాదులు వచ్చాయన్నారు. 2018లో జరిగిన అసెంబ్లీ ఎన్నికలు, 2019 లోక్‌సభ ఎన్నికల రోజున సంస్థలు సెలవులు ఇవ్వకపోవడంతో ఫిర్యాదులు వచ్చాయని తెలిపారు. నవంబర్‌ 30న ఎన్నికల రోజు అన్ని సంస్థలు హాలిడే ఇస్తున్నాయో లేదో పరిశీలించి, సెలవు ఇవ్వని కంపెనీ యాజమాన్యంపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని కార్మిక శాఖకు తెలంగాణ సీఈవో వికాస్‌ రాజ్‌ ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో నవంబరు 29, 30 తేదీల్లో పాఠశాలలకు ప్రభుత్వం సెలవు ప్రకటించింది. గరంలోని పలు విద్యాసంస్థల్లో పోలింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేశారు. నవంబరు 29న ఆయా పోలింగ్‌ కేంద్రాలకు ఎన్నికల సామగ్రిని తరలించన్నారు. ఈ నేపథ్యంలో విద్యాసంస్థలకు రెండు రోజుల పాటు సెలవు ప్రకటించారు. డిసెంబర్‌ 1న మళ్లీ స్కూళ్లు, కాలేజీలూ తెరచుకోనున్నాయి. తెలంగాణలో ఎన్నికల ప్రచారం ముగిసింది. హైదరాబాద్‌ నగరంలో 144 సెక్షన్‌ అమల్లోకి వచ్చిందని సీపీ సందీప్‌ శాండిల్య తెలపారు. ఎన్నికల ముగిసే వరకు మద్యం దుకాణాలు బంద్‌ ఉంటాయని పేర్కొన్నారు. మూడు రోజులపాటు మద్యం అమ్మకాలు నిలిపివేస్తూ హైదరాబాద్‌ సీపీ నిర్ణయం తీసుకున్నారు. ఎన్నికల ముగిసేవరకు 144 సెక్షన్‌ కొనసాగుతుందని సీపీ వెల్లడించారు. ఐదుగురికి మించి ఎక్కడైనా గుమ్మిగడితే చర్యలు తప్పవని సీపీ తెలిపారు. బార్లు, వైన్‌ షాపులు, పబ్బులు మూసివేయాలని సీపీ ఆదేశాలు ఇచ్చారు. మూడు రోజులపాటు మద్యం అమ్మకాలపై ఆంక్షలు విధించారు.

 

నెత్తుటితో తడిచిన దేహం కాంతారా ప్రీక్వెల్‌ ప్రారంభం

ఓట్లు దండుకోవాల‌న్న దురాశే కానీ రైతుల‌కు మేలు జర‌గాల‌న్న ఉద్దేశం లేదు.. రేవంత్‌రెడ్డి

About Dc Telugu

Check Also

Trump

Trump”అమెరికా మాజీ అధ్య‌క్షుడిపై కాల్పులు..

Trump” అగ్ర‌రాజ్యం అమెరికాలో క‌ల‌క‌లం రేపింది. అమెరికా అధ్య‌క్ష ఎన్నిక‌ల ప్ర‌చారంలో ఉన్న మాజీ అధ్య‌క్షుడు డోనాల్డ్ ట్రంప్‌పై దుండగులు …

Kothur Junction

Kothur Junction” డీసీఎం యూట‌ర్న్‌.. లారీ అదుపు తప్పి మ‌రో లారీని ఢీ… స్కూటీ మీద వెళ్తున్న వ్య‌క్తి మృతి.. వీడియో

Kothur Junction” కొత్తూరు జంక్షన్‌ వద్ద ప్రమాదం కొన్ని సార్లు మ‌న త‌ప్పు లేకున్నా ఎదుటి వారి నిర్ల‌క్ష్యమో.. అతి …

Hyderabad news

Hyderabad news” ట్రాన్స్ జెండర్ దారుణ హత్య..

Hyderabad news హైద‌రాబాద్‌లో ట్రాన్స్ జెండ‌ర్ దారుణ హ‌త్య‌కు గుర‌య్యారు. వివ‌రాల్లోకి వెళ్తే.. హైదరాబాద్ న‌గ‌రంలోని సనత్ నగర్ లోని …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Social Media Auto Publish Powered By : XYZScripts.com