Cm Pressmeet” కెటిఆర్‌, హరీష్‌, ఈటెల అక్కడ ఉంటారా సుందరీకరణ కాదు.. మూసీ నది పునరుజ్జీవం

Cm Pressmeet”  త‌మ ప్ర‌భుత్వం చేపడుతున్న కార్య‌క్ర‌మం మూసీ న‌ది సుందరీకరణ కాద‌ని.. మూసీ నది పునరుజ్జీవమని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తెలిపారు. ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు దీన్ని వక్రీకరిస్తున్నార‌ని ఆగ్రహం వ్యక్తం చేశారు. సెక్ర‌టేరియేట్‌లో గురువారం ఏర్పాటు చేసిన విూడియా సమావేశంలో వివ‌రాలు చెప్పారు. ఈ ప్రాజెక్టు ‘మూసీ దుర్గంధంలో మగ్గిపోతున్న వాళ్ల‌కు మెరుగైన జీవితాన్ని ఇచ్చేందుకే ఈ ప్రాజెక్టు తలపెట్టామని చెప్పుకొచ్చారు. రాజ‌ధాని మ‌ధ్య‌లో నుంచి న‌ది వెళ్తున్న న‌గ‌రం మరొకటి లేద‌ని చెప్పుకొచ్చారు. తాము చేప‌డుతున్న‌ది మూసీ సుంద‌రీక‌ర‌ణ కాద‌ని మూసీ న‌ది పున‌రుజ్జీవమ‌ని స్ప‌ష్టం చేశారు. మూసి న‌ది 300 కిలోమీట‌ర్లు ప్ర‌వాహిస్తున్న‌ద‌న్నారు. మూసి లో ఉన్న మురికి కంటే కొంద‌రి మెద‌డులో ఎక్కువ విషం నింపుకున్నార‌ని ఎద్దెవా చేశారు. మెద‌డులో విషం పెట్టుకుని దుష్పచ్రారం చేస్తున్నార‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. కేటీఆర్‌ మూసీ సుందరీకరణ కోసం ప్రణాళికలు రూపొందించామని అనలేదా అని ప్ర‌శ్నించారు. ? ఈ ప్రాజెక్టును అడ్డుకుంటున్న నాయ‌కులు మూడు నెలలు మూసీ న‌ది ఒడ్డున ఉండాల‌న్నారు. కేటీఆర్‌, హరీశ్‌రావు, ఈటల రాజేంద‌ర్‌లు అక్క‌డ ఉండాల‌ని సూచించారు. అక్క‌డ ఉంటామంటే అవ‌స‌రంప‌డే వసతులు ఏర్పాటు చేస్తామ‌న్నారు. ఈ ముగ్గురూ న‌ది ఒడ్డున అక్కడ ఉంటే.. ఈ ప్రాజెక్టును మ‌ధ్య‌లో ఆ పేస్తామ‌ని ప్ర‌క‌టించారు. ప్రాజెక్టు కోసం అయిన ఖ‌ర్చును తానే భ‌రిస్తాన‌ని చెప్పారు. స‌మావేశంలో ఛీఫ్ సెక్ర‌ట‌రీ శాంతి కుమారి ఉన్నారు.

ఇవి కూడా చ‌దవండి

Mee Seva” తెలంగాణా మీసేవ ఫెడరేషన్ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ గా చల్ల కృష్ణ నియామకం

Bengaluru News” గుడిలో శ్లోకాలు చదువుతుంటే.. మహిళ మెడలో గొలుసు కొట్టేసిన దొంగ.. వీడియో

Lulu Chairman”అప్పు క‌ట్టి రూ.10 ల‌క్ష‌లు ఇచ్చి.. లూలు చైర్మెన్ గొప్ప ఆర్థిక సాయం..

Jaipur” మంటలలో కాలుతూ దూసుకెళ్లిన కారు.. వీడియో

Ratan Tata” రతన్ టాటా ప్ర‌స్తానం ఇదే.. 100 బిలియ‌న్ల వ్యాపార సామ్రాజ్యం..

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *