Karimnagar News” ప్రభుత్వ మెడికల్ కళాశాలలో చట్టాలపై అవగాహన సదస్సు లింగ నిర్దారణ చేస్తే కఠిన చట్టాలు ఉన్నాయని కరీంనగర్ సీనియర్ సివిల్ జడ్జ్ కే వెంకటేష్ అన్నారు. జాతీయ న్యాయ సేవాధికార సంస్థ ఆదేశాలకు అనుగుణంగా, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ సెక్రెటరీ, సీనియర్ సివిల్ జడ్జ్ కే వెంకటేష్ ఆధ్వర్యంలో నగరంలోని ప్రభుత్వ మెడికల్ కళాశాలలో గురువారం అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులకు న్యాయ సేవాధికార సంస్థ, సైబర్ నేరాలు, ర్యాగింగ్ నిరోధక చట్టం, పలు మెడికల్ చట్టాలపై అవగాహన సదస్సు నిర్వహించారు. లింగ నిర్ధారణ చేస్తే కఠినమైన చట్టాలు ఉన్నాయన్నారు. అలాగే మెడికల్ నెగ్లిజెన్సీ వలన వినియోగదారుల చట్టం ద్వారా బాధితులు కేసు నమోదు చేసుకోవచ్చని తెలిపారు. అందువల్ల చట్టాల పైన అవగాహన పెంచుకొని ఎలాంటి చట్టపరమైన సమస్య రాకుండా చూసుకోవాలని సూచించారు. అవగాహన లేక ఎలాంటి చట్టపరమైన సమస్యలో చిక్కుకోవద్దని విద్యార్థులకు వివరించారు. ఈ సందర్భంగా ఎలాంటి న్యాయపరమైన లేదా న్యాయ సేవ అవసరమైన సంప్రదించవలసిందిగా విద్యార్థులకు తెలిపారు. ఈ కార్యక్రమంలో లీగల్ డిఫెన్స్ కౌన్సిల్ తణుకు మహేష్, కొత్తపల్లి ఎస్ఐ సాంబమూర్తి, కళాశాల వైస్ ప్రిన్సిపల్ పాల్వాయి సునీత , బోధన బోధనేతర సిబ్బంది విద్యార్థులు పాల్గొన్నారు.
Red MI 5G Phone” 8 వేలల్లో రెడ్‌మీ 5 జీ ఫోన్.. ఇప్పుడే బుక్ చేయండి అమెజాన్‌లో
Samsung Monitor” సాంసంగ్ 27 ఇంచుల మానిటర్ కేవలం 9,999 రూపాయలే..
Winter Cap” ఎంతటి చలిలోనైనా మిమ్మల్ని వెచ్చగా ఉంచుతుంది.. కేవలం 99 రూపాయలే..