మున్నూరు కాపు సంఘం తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ చల్ల హరిశంకర్
కరీంనగర్ ప్రతినిధి పోకల మధు
యువతలో ఐక్యతను పెంపొందించేందుకు, వారి ప్రతిభనువెలికితీసేందుకు పటేల్ క్రికెట్ లీగ్ పోటీలు జనవరి 10, 11, 12 తేదీల్లో కరీంనగర్ జిల్లా కేంద్రంలోని ఎస్ఆర్ఆర్ కళాశాల గ్రౌండ్‌లో నిర్వహించనున్నట్లు మున్నూరు కాపు సంఘం తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ చల్ల హరిశంకర్ తెలిపారు. నగరంలోని తన మీకోసం కార్యాలయంలో, మున్నూరు కాపు జర్నలిస్టు ఫోరం, పటేల్ యూత్ ఫోర్స్, మున్నూరు కాపు ప్రజా ప్రతినిధులతో కలిసి టోర్నమెంట్ పోస్టర్లను గురువారం ఘనంగాఆవిష్కరించారు. ఈ సందర్భంగా చల్ల హరిశంకర్ మాట్లాడుతూ.. క్రీడలు యువతకు ఒక అద్భుతమైన వేదిక. ఈ పోటీలు కేవలం క్రీడాపరమైన ప్రతిభను మాత్రమే కాకుండా యువతలో ఐక్యత, సహకారం, లక్ష్యసాధన వంటి విలువలను కూడా పెంపొందిస్తాయి. పటేల్ క్రికెట్ లీగ్ పోటీలు మున్నూరు కాపు యువతకు స్ఫూర్తినిచ్చే ఘట్టంగా నిలుస్తాయి అన్నారు.ఈ క్రికెట్ పోటీలు యువతలో కొత్త ఆశయాలకు నాంది పలుకుతాయనీ, యువకుల ఉత్సాహానికి ఒక మంచి వేదికగా నిలుస్తాయని పేర్కొన్నారు . మున్నూరు కాపు యువత ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. మున్నూరు కాపు జర్నలిస్టు ఫోరం, పటేల్ యూత్ ఫోర్స్ వ్యవస్థాపక అధ్యక్షులు కొత్త లక్ష్మణ్ పటేల్ మాట్లాడుతూ.. మున్నూరు కాపు యువతలో ఐక్యతను ప్రోత్సహించడం, వారి ప్రతిభను వెలికితీయడం, అలాగే క్రీడాభివృద్ధికి మద్దతు ఇవ్వడమే ఈ టోర్నమెంట్ ముఖ్య లక్ష్యం. విజేతలకు ప్రత్యేకంగా నగదు బహుమతులు అందించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్నూరు కాపు జర్నలిస్టు ఫోరం జిల్లా అధ్యక్షులు వేల్పుల శ్రీనివాస్ పటేల్, ప్రధాన కార్యదర్శులు సూదుల వెంకటరమణ పటేల్, సహాయ కార్యదర్శి రాచమల్ల సుగుణాకర్ పటేల్, సత్తినేని శ్రీనివాస్, బొల్లం లింగమూర్తి, ముప్పిడి సునీల్, ఆవుల శ్రీనివాస్, పెంట అజయ్, మారుతి పటేల్, గుమ్మడి శ్రీనివాస్, కొట్టే మల్లేశం, జైల్లోజు శ్రీనివాస్ కుల సంఘ సభ్యులు యూత్ ఫోర్స్ కోర్ కమిటీ సభ్యులు గాజుల శ్రీనివాస్ పటేల్ , పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి
TOSHIBA Smart LED TV” తోషిబా 43 ఇంచుల టీవీ ₹ 24,999లు..
Ear Buds”15 నిమిషాలు ఛార్జ్ చేస్తే 240 నిమిషాలు బ్యాటరీ లైఫ్ బోట్ ఇయర్ బడ్స్ రూ. 1799 లకే…
PM Fasal Bima Yojana” రైతులకు శుభవార్త చెప్పిన కేంద్ర ప్రభుత్వం
realme GT 7 Pro Smart Phone” రియల్ మీ జీటీ ప్రో .. మొట్టమొదటి స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ ప్రాసెసర్
Smart TV” ఎల్ ఈడీ టీవీల ఈయర్ ఎండ్ బొనాంజా.. అదిరే ఆఫర్లు.. 55 ఇంచుల టీవీలు
Tata Group” టాటా గ్రూపులో 5 లక్షల ఉద్యోగాలు, టాటా గ్రూప్ ఛైర్మన్ ఎన్ చంద్రశేఖరన్
Lava Agni 3 5G Smart Phone” లావా అగ్ని 3 5G స్మార్ట్ ఫోన్..11 శాతం తగ్గింపుతో ₹24,998
Earbuds” కొత్త ఇయర్ బడ్స్ జస్ట్ 699 రూపాయలకే