China Virus News” చైనాలో ఆగ‌మాగం..ఆస్ప‌త్రుల‌కు క్యూ క‌ట్టిన జ‌నం.. సీజ‌న‌ల్ వ్యాధే అంటున్న చైనా

China Virus News” క‌రోనా పేరు చెబితే ఇప్ప‌టికీ జ‌నాల్లో వ‌ణుకు పుడుతోంది. చైనా నుంచి ప్ర‌పంచానికి పాకిన ఈ వైర‌స్ ఒక్కో దేశాన్ని చిగురుటాకులా వ‌ణికించిన విష‌యం తెలిసిందే. నాలుగేండ్ల క్రితం ఇదే స‌మ‌యంలో క‌రోనా విల‌య‌తాండం సృష్టించింది. కోవిడ్ 19 దెబ్బ‌కు సామాన్యుడి నుంచి అగ్ర‌దేశాల వ‌ర‌కు కుదేల‌య్యాయి.
అయితే మ‌రోసారి చైనాలో హాస్పిట‌ల్స్ కు జ‌నం క్యూక‌డుతున్నార‌ని నేష‌న‌ల్‌, ఇంట‌ర్నేష‌న‌ల్ మీడియా లో క‌థ‌నాలొస్తున్నాయి.. రెండు మూడు వైర‌స్‌లు అక్క‌డి జ‌నానికి సోకుతున్న‌ట్టు స‌మాచారం. అయితే దీనిపై చైనా ఇత‌ర దేశాల‌కు కానీ, ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ‌కు కానీ అధికారికంగా వెల్ల‌డించ‌లేదు. ఇవి చ‌లికాలంలో సాధార‌ణంగా వ‌చ్చే వ్యాధులేన‌ని పెద్ద‌గా ఆందోళ‌న చెందాల్సిన అవ‌స‌రం లేద‌ని ఆ దేశం చెప్పుకొస్తుంది. దీనిపై చైనా నుంచి ఎటువంటి అధికార ప్ర‌క‌ట‌న వెలువ‌డ‌లేదు. కొవిడ్-19తో పాటు ఇన్‌ఫ్లుయెంజా-ఏ, HMPV, మైకోప్లాస్మా న్యూమోనియా వంటి వైరస్‌లు వ్యాప్తి చెందున్నాయ‌ని అంత‌ర్జాతీయ మీడియా వార్త‌లు రాసుకొచ్చింది. హెచ్‌ఎంపీవీ వైరస్‌ లక్షణాలు కూడా ఫ్లూ, ఇతర శ్వాసకోశ ఇన్ఫెక్షన్ల మాదిరిగానే ఉంటాయని వైద్య నిపుణులు వెల్లడించారు. దగ్గు, జ్వరం, ముక్కు దిబ్బడగా అనిపించడం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది వంటివి కనిపిస్తాయి. వైరస్‌ తీవ్రత ఎక్కువగా ఉన్నవారిలో బ్రాంకైటిస్‌, నిమోనియాకు దారితీయవచ్చ‌ని వైద్యులు చెబుతున్నారు. అయితే 2001లోనే హ్యూమన్‌ మెటానిమోవైరస్ గుర్తించారు. వ్యాధి లక్షణాలు బయటకు కనిపించడానికి మూడు నుంచి ఆరు రోజులు పడుతుంది.
అమెరికాకు చెందిన సెంటర్స్‌ ఫర్‌ డిసీజ్‌ కంట్రోల్‌ అండ్‌ ప్రివెన్షన్‌ ప్రకారం.. చిన్నారులు, వృద్ధులు, బలహీనమైన రోగనిరోధక శక్తి కలిగిన వ్యక్తులు దీనిబారిన పడే అవకాశాలు ఎక్కువని అంటున్నారు.
అక్క‌డి ఆస్ప‌త్రుల సంబందించిన వీడియోలు మాత్రం సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతున్నాయి. కోవిడ్ త‌ర‌హా ల‌క్ష‌ణాలో క‌న్పిస్తున్న‌ట్టు తెలుస్తున్న‌ది. ఓ అంత‌ర్జాతీయ మీడియా సంస్థ విడుద‌ల చేసిన నివేదిక అందుకు బలం చేకూరుస్తున్న‌ది. అయితే ఈ వ్యాధి అక్క‌డి సీజ‌న‌ల్ వ్యాధేన‌ని ఆ దేశం పేర్కొంటుంది. ఈ వ్యాధి చైనాతో పాటు జ‌పాన్‌లోనూ విస్తురిస్తున్న‌ట్టు స‌మాచారం.

ఈ వైర‌స్ సోక‌కుండా చిన్న చిన్న జాగ్ర‌త్త‌ల‌తో నివారించుకోవ‌చ్చ‌ని వైద్య‌నిపుణులు తెలుపుతున్నారు. చేతుల‌ను స‌బ్బుతో 20 సెక‌న్ల‌తో పాటు శుభ్రం చేసుకోవాలి. అ ప‌రిశుభ్ర చేతుల‌తో ముఖాన్ని, కండ్ల‌ను తాకుకూడ‌దు. ఎవ‌రైన వైర‌స్ సోకిన వారుంటే వారికి దూరంగా ఉండ‌డం. వారు వాడిన వ‌స్తువులు వాడ‌కూడ‌ద‌ని వైద్యులు చెబుతున్నారు.

చైనాలో వ్యాప్తిసున్న హెచ్ ఎంపీ వైర‌స్‌తో ప్ర‌స్తుతానికి ఇండియాకు ఎలాంటి ముప్పులేద‌ని ఆరోగ్య సేవ‌ల డైరెక్ట‌ర్ జ‌న‌ర‌ల్ అతుల్ గోయ‌ల్ తెలిపారు. చైనాలో వ్యాపిస్తున్న వైర‌స్ అంశంపై స‌మాచారం తెప్పిస్తున్నామ‌న్నారు. గ‌త నెలలో శ్వాస కోస స‌మ‌స్య‌ల కేసులు ఏమీ పెరగ‌లేద‌ని స్ప‌ష్టం చేశారు.

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *