Karimnagar news” బురదజల్లడం మానకుంటే భరతం పడతాం..
గోసి గొంగడితో వచ్చిన రసమయికి కోట్ల ఆస్తులు ఎలా వచ్చాయి…
నిరూపించాలని కాంగ్రెస్ నేతల సవాల్
టీపీసీసీ సభ్యులు బత్తిని శ్రీనివాస్ గౌడ్ …
శంకరపట్నం డిసి ప్రతినిధి
మానకొండూరు ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ పై తప్పుడు ఆరోపణలు, తప్పుడు ప్రచారం మానుకోవాలని, టీపీసీసీ సభ్యులు శంకరపట్నం మండలం మాజీ జెడ్పిటిసి కరుడుగట్టిన కాంగ్రెస్ వాది బత్తిని శ్రీనివాస్ గౌడ్ అన్నారు. ఇలా తప్పుడు ఆరోపణలు, తప్పుడు ప్రచారాలు మానుకోవాలని మాజీ ఎమ్మెల్యే రసమయికి హితవు పలికారు. మానకొండూర్ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో సోమవారం కాంగ్రెస్ పార్టీ తిమ్మాపూర్ మండల అధ్యక్షుడు మోరపల్లి రమణారెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో శ్రీనివాస గౌడ్ మాట్లాడారు. మానకొండూర్ శాసనసభ్యుడు డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ డబ్బుల కోసమే సహకార సంఘాలకు ప్రత్యేక అధికారులను నియమించాలని అధికారులపై ఒత్తిడి చేస్తున్నారని మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ ఆరోపణలు చేయడాన్ని కాంగ్రెస్ పార్టీ నాయకులు ముక్తకంఠంతో తీవ్రంగా ఖండించారు. సింగిల్ విండో చైర్మన్లను డబ్బు డిమాండ్ చేసినట్టుగా నిరూపించాలని రసమయికి సవాలు విసిరారు. ప్రతిపక్ష హోదాలో ఉండి అబద్ధపు ప్రచారాలు చేయడం సరికాదని హితవు పలికారు.
నోరు జారితే నాలుక చీరేస్తాం : తాళ్లపల్లి
రసమయి బాలకిషన్ నోటికొచ్చినట్టు మాట్లాడటం ఇకనైనా మానుకోనుకోవాలని, ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణపై అవాకులు చెవాకులు పేలితే నాలుక చీరేస్తామని జిల్లా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి తాళ్లపల్లి సంపత్ గౌడ్ హెచ్చరించారు. అమాసకో, పున్నానికో వచ్చి పోయే రసమయి వచ్చినప్పుడల్లా ప్రెస్ మీట్లు పెట్టి ఎమ్మెల్యేపై తప్పుడు ఆరోపణలు చేయడం ఆయనకు పరిపాటిగా మారిందని విమర్శించారు. అభివృద్దే ధ్యేయంగా పని చేస్తున్న కవ్వంపల్లిపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ఇక సహించబోమని హెచ్చరించారు. తగిన శాస్తి చేస్తామని ఆయన స్పష్టం చేశారు. 25 లక్షలకు సింగిల్ విండో చైర్మన్, 5 లక్షలకు వైస్ చైర్మన్ పదవులు ఇప్పించిన రసమయి నీతులు వల్లించడం అసహ్యంగా ఉందని ఆయన ఎద్దేవా చేశారు.
బాలకిషన్ కోట్ల ఆస్తులు ఎలా వచ్చాయ్ : కోటి..
గోసి గొంగడితో వచ్చిన రసమయి బాలకిషన్ కోట్లు విలువ చేసే ఆస్తిపాస్తులు ఎలా సంపాదించాడో చెప్పాలని జిల్లా సహకార కేంద్రబ్యాంక్ డైరెక్టర్ అలువాల కోటి డిమాండ్ చేశారు. ఇది ముమ్మాటికీ అక్రమ సంపాదనే తప్ప నీతివంతంగా సంపాదించచలేదని ఆయన స్పష్టం చేశారు. అవినీతి అక్రమాలకు పాల్పడే రసమయి అవినీతి గురించి మాట్లాడటం దయ్యాలు వేదాలు వల్లించినట్టుగా, దొంగే దొంగ దొంగ అంటూ అరిచినట్టుగా ఉందని ఆయన ఎద్దేవా చేశారు. రసమయి అకృత్యాలను, ఆయన వికృత చేష్టలను దగ్గరగా తాను చూశానని, యాటలకు, కోళ్లకు కక్కుర్తిపడే వ్యక్తి అని ఆయన విమర్శించారు.
మానకొండూర్ నియోజవర్గంలో 12 సహకార సంఘాలు ఉన్నాయని, వీటిలో 7 సంఘాల్లో అవినీతి, అక్రమాలు జరిగాయనే ఆరోపణల నేపథ్యంలో ఆ సంఘాల చైర్మన్ల స్థానంలో తాజాగా ప్రత్యేక అధికారులను నియమించడం జరిగిందని కోటి వివరించారు.
మోసకారి రసమయి : గంకిడి..
పోరండ్ల సింగిల్ విండో చైర్మన్ గా చేస్తానంటూ తన వద్ద 20 లక్షలు తీసుకొని మోసం చేశారని తిమ్మాపూర్ మాజీ సర్పంచ్ గంకిడి లక్ష్మారెడ్డి ఆరోపించారు. 40 లక్షలు డిమాండ్ చేయగా, తాను 20 లక్షలు మాత్రమే ఇవ్వగలుగుతానని, అది కూడా భూమి అమ్మి ఇవ్వాల్సి ఉంటుందని చెప్పానని, డబ్బులు తీసుకున్న రసమయి తనకు కాకుండా 30 లక్షలు ఇచ్చిన వ్యక్తికి సింగిల్ విండో చైర్మన్ పదవి ఇప్పించారని ఆయన తీవ్రంగా ఆరోపించారు. వంచనలకు పాల్పడే రసమయి నీతులు వల్లించడం విడ్డూరంగా ఉందని ఆయన విమర్శించారు.
రాజకీయ అజ్ఞాని : బత్తిని..
ఎమ్మెల్యేగా పదేళ్లపాటు కొనసాగిన రసమయి బాలకిషన్ విలువలకు పాతరేశారని, ఆయనో రాజకీయ అజ్ఞాని అని ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ సభ్యుడు బత్తిని శ్రీనివాస్ గౌడ్ విమర్శించారు. ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఆయన ఏనాడూ హుందాగా వ్యవహరించలేదని, తనకు ఉన్న అవలక్షణాలన్నీ ఇతరుల్లో ఉన్నాయనుకొనే భ్రమలో ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి పై తప్పుడు ఆరోపణలతో బురదజల్లే ప్రయత్నాలు చేస్తున్నారని ఆయన ఆరోపించారు. సహకార సంఘాల్లో గోల్ మాల్ కు పాల్పడిన చైర్మన్లను తప్పిస్తే తప్పేంటని ఆయన సూటిగా ప్రశ్నించారు.
రసమయికి డబ్బుపైనే యావ ఎక్కువ : ఊట్కూరి
రసమయికి ప్రజాసేవ కన్నా డబ్బు సంపాదనపైననే యావ ఎక్కువ అని సెస్ మాజీ డైరెక్టర్, ఇల్లంతకుంట మండల పరిషత్ మాజీ అధ్యక్షుడు ఊట్కూరి వెంకట రమణారెడ్డి విమర్శించారు. డబ్బు కోసం ఏమైనా చేయగలుగుతారని, ఈ విషయంలో తన,మన అనే తేడాలు, మినహాయింపులు ఉండవని పేర్కొన్నారు. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు ఎవరెవరి వద్ద డబ్బులు తీసుకొని పదవులు ఇప్పించారో అందరికీ తెలుసుని, రసమయి చెప్పే మాటలను నమ్మే పరిస్థితుల్లో ప్రజలు లేరని ఆయన పేర్కొన్నారు.
ఈ విలేకరుల సమావేశంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు ముస్కు ఉపేందర్ రెడ్డి గన్నేరువరం, బి.రాఘవరెడ్డి ఇల్లంతకుంట, పార్టీ నాయకులు గోపు మల్లారెడ్డి, కనకం అశోక్, గోపు శ్రీనివాస్ రెడ్డి, మామిడి అనిల్, తుమ్మనపల్లి శ్రీనివాస్ రావు, బండారు రమేశ్, కొత్త తిరుపతిరెడ్డి, చెన్నబోయిన రవి, కుంటి మల్లేశం, ద్వావ శ్రీనివాస్ రెడ్డి, మాడ తిరుపతి రెడ్డి ఒగ్గు దామోదర్, అల్లూరి శ్రీనాథ్ రెడ్డి, కొమ్మెర రవీందర్ రెడ్డి, లింగాల మల్లారెడ్డి, ,బొడ్డు సునిల్, మాతంగి అనిల్,పోలు రాము , సాయిరి దేవయ్య, సుధగోని తిరుపతి తదితరులు పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి
Karimnagar news” ఈ కోర్టు తీర్పు కుల అహంకారానికి చెంపపెట్టు
QLED Smart tv: జేవీసీ 32 ఇంచుల టీవీ ఇది.. ఫీచర్ల్ ఇవే..
Cinema News” నిన్నటి నుంచి ట్రెండింగ్.. టాలీవుడ్‌ను ఏలేదీ ఆ అమ్మాయే
Cinema News” ఆ మార్క్‌ను దాటిన సంక్రాంతికి వస్తున్నాం..
Amazon Offer” ఎలక్ట్రిక్ లైటర్‌తో దేన్నైనా వెలిగించొచ్చు.. కొవ్వొత్తి, బాణా సంచాలను కూడా
Smart Phone” ఐక్యూ 12 5జీ లెజెండ్ స్మార్ట్ ఫోన్… 256 స్టోరేజీతో..
Petrol” ఆ వాహనాలకు పెట్రోల్ బంద్ .. వాటిని గుర్తించేందుకు గ్యాడ్జెట్లు