Flying car”ఎగిరే కారును త‌యారు చేసిన అమెరికా కంపెనీ.. వీడియో

Flying car

Flying car” మ‌హాన‌గ‌రాల నుంచి చిన్న చిన్న ప‌ట్ట‌ణాల దాకా రోడ్డెక్కితే చాలు ట్రాఫిక్ క‌ష్టాలు వెంటాడుతాయి. కాస్తా దూరానికైనా గంట‌ల త‌ర‌బ‌డి రోడ్డుపై వేచి ఉండాలి. బైకర్ల కంటే కార్ల‌లో వెళ్లే వారికి ట్రాఫిక్ క‌ష్టాలు ఉంటాయి. రోడ్డుపై అవ‌స్థ‌లు ప‌డుతున్న‌ప్పుడు కారు ఎగిరిపోతే బాగుంటుంద‌ని అన్పిస్తుంది. అయితే ఈ క‌ష్టాలు త్వ‌ర‌లోనే తీర‌నున్నాయి. ప‌లు అంత‌ర్జాతీయ మీడియా క‌థ‌నాల ప్ర‌కారం.. ఎగిరే కారును త‌యారు చేసిన‌ట్టు తెలుస్తోంది. అమెరికాలోని ప్ర‌ముఖ ఎల‌క్ట్రిక‌ల్ కార్ల కంపెనీ అయిన అలెఫ్ ఏరోనాటిక్స్ ఈ కారును త‌యారు చేసింది. ఇటీవ‌ల చేసిన ప‌రీక్ష‌ల్లో ఈ కారు ఎటువంటి రెక్క‌లు లేకుండానే గాల్లోకి ఎగిరింది. 2019 నుంచి ఈ ఎగిరే కార్ల పై టెస్ట్ డ్రైవ్ చేస్తోంది. ఈ కారుకు సంబంధించిన విష‌యాల‌ను కంపెనీ సీఈవో జిమ్ డుఖోవ్నీ ఇంట‌ర్నేష‌నల్ మీడియాకు వివ‌రాలు వెల్ల‌డించారు. ఈ కారు వంద శాతం విద్యుత్తుతో నడుస్తుంద‌ని వివ‌రించారు. గాల్లో 110 మైళ్ల వేగం, రోడ్డుపై 200 మైళ్ల వేగంతో ఈ కారు దూసుకెళ్ల‌నుంది. ఈ కారుకు టేకాఫ్ మ‌రియు ర‌న్‌వేలు అవ‌స‌రం లేద‌ని కంపెనీ తెలిపింది. గాల్లోకి టేకాఫ్ తీసుకునేందుకు నిర్ధిష్ట వేగం కూడా అవ‌స‌రంలేద‌ని కంపెనీ వివ‌రించింది. ఉన్న‌కాడి నుంచే పైకి ఎగ‌ర‌గ‌ల‌దు. ఇంకా పూర్తి స్థాయిలో అమెరికా ప్ర‌భుత్వం నుంచి అనుమ‌తి రావాల్సి ఉన్న‌ట్టు స‌మాచారం. అవ‌న్నీ పూర్త‌యిన త‌ర్వాత మార్కెట్‌లోకి కారు రానుంది. త్వ‌ర‌లోనే కార్ల ఉత్పత్తిని ప్రారంభించాలని అలెఫ్ భావిస్తోంది.ఈ కారు ధ‌ర సుమారు రెండున్న‌ర కోట్లు రూపాయ‌లు ఉండొచ్చ‌ని అంచ‌నా. ఇప్ప‌టి వ‌ర‌కు సుమారు 3,200 ప్రీఆర్డర్లు ఉన్న‌ట్టు స‌మాచారం.

 

మ‌రిన్ని ఆస‌క్తిక క‌థ‌నాల కోసం ఈలింక్ ను క్లిక్ చేయండి.. https://whatsapp.com/channel/0029VaBklCu6xCST8YUVgT00

IIT Thirupathi”ఐఐటీ తిరుపతి గ్రాడ్యుయేట్ అప్రెంటిస్, టెక్నీషియన్ అప్రెంటిస్ రిక్రూట్‌మెంట్

Amazon Offer” సాంసంగ్ నుంచి స్ట‌న్నింగ్ ఫోన్‌.. 5జీ ఏఐ స్మార్ట్ ఫోన్‌..

Government Jobs” హైద‌రాబాద్‌లోని ఐఐసీటీ జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్స్‌.. ఇంట‌ర్ అర్హ‌త పోస్టులు 15

TS Government Jobs” అంగన్వాడీల్లో టీచ‌ర్లు, హెల్ప‌ర్ల కొలువుల జాత‌ర.. ఇంట‌ర్ అర్హ‌త‌..

Harihara Veeramallu” సరసర వచ్చినాడు చిచ్చర పిడుగంటి వాడుస మీరు ప్రోమో వినండి..

Amazon Offer” వ‌న‌ప్ల‌స్ 12ఆర్ 8 జీబీ ర్యామ్‌, 256జీబీ స్టోరేజీ.. చూడండి వివ‌రాలు..

Amazon Offer” వ‌న‌ప్ల‌స్ 12ఆర్ 8 జీబీ ర్యామ్‌, 256జీబీ స్టోరేజీ.. చూడండి వివ‌రాలు..

Flipkart Offer” 50 ఇంచుల టీవీ కేవ‌లం రూ. 26,999ల‌కే.. ఫ్లిప్‌కార్ట్ ఆఫ‌ర్ తో మ‌రింత త‌క్క‌వ‌లోనే..

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *