Petrol” న్యూఢిల్లీ : కాలుష్యాన్ని నివారించేందుకు కొత్తగా కొలువు దీరిన దిల్లీ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. దిల్లీ లో ఎయిర్ పొల్యూషన్ విపరీతంగా ఉన్నదన్న విషయం తెలిసిందే. దీని నివారణకు అక్కడి కొత్త ప్రభుత్వం చర్యలు ప్రారంభమయ్యాయి. ఇందులో బాగంగా ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంది. కాలుష్య కట్టడి చర్యల్లో భాగంగా శనివారం పర్యావరణ మంత్రి మంజిందర్ సింగ్ సిర్సాతో అధికారులు భేటీ అయ్యారు. ఈ సందర్భంగా పలు నిర్ణయాలు తీసుకున్నారు. 15 సంవత్సరాలు పైబడిన వాహనాలకు పెట్రోల్ పోయొద్దని నిర్ణయించింది. మార్చి నెల 31 తర్వాత బంకుల్లో ఇంధనం పోయకూడదంటూ నిర్ణయించింది. ‘పెట్రోల్ బంకుల వద్ద గాడ్జెట్‌లు ఏర్పాటు చేస్తామని మంత్రి తెలిపారు. 15 ఏండ్లు పైబడిన వాహనాలను అవి గుర్తిస్తాయన్నారు. దీంతో వాటికి ఇంధనం అందదని మంత్రి వెల్లడించారు. ఈ ఆంక్షలకు సంబంధించిన సమాచారాన్ని కేంద్ర పెట్రోలియం శాఖకు ఇస్తామని ఆయన తెలిపారు. అలాగే ఎత్తైన భవనాలు, హోటళ్లు, వాణిజ్య సముదాయాల్లో తప్పకుండా యాంటీ స్మోక్ గన్లను అమర్చాలని వెల్లడించారు. ఈ సంవత్సరం డిసెంబర్ నెల నాటికి 90 శాతం సీఎన్‌జీ బస్సులను దశలవారీగా ఉపసంహరించుకుంటామని ప్రకటించారు. వీటి స్థానాన్ని ఎలక్టిక్ర్ బస్సులతో భర్తీ చేస్తామన్నారు. ప్రతిఏడు శీతాకాలంలో దిల్లీ కాలుష్య కోరల్లో చిక్కుకుపోతున్న విషయం తెలిసింది.

మీ సోదరికి కానీ, మహిళా భాగస్వామికికానీ, సన్నిహితులకు కానీ మంచి గిఫ్ట్ ఇవ్వాలనుకుంటున్నారా.. ఈ వుమెన్ స్మార్ట్ స్మార్ట్ వాచ్ ను పరిశీలించండి… ఈ లింక్ ను క్లిక్ చేయండి.. https://amzn.to/4h6fsFe
మరిన్ని కథనాల కోసం ఈలింక్ ను క్లిక్ చేయండి..https://whatsapp.com/channel/0029VaBklCu6xCST8YUVgT00
TG EAPCET” టిజి ఎప్‌సెట్ ఆన్‌లైన్‌లో దరఖాస్తుల స్వీకరణ.. ఫీజు తదితర పూర్తి వివరాలు..
SSMB Movie” జిమ్‌లో వర్కౌట్స్.. లుక్ మార్చేసిన మహేశ్‌బాబు..వీడియో
Constable Jobs” పదోతరగతితో కానిస్టేబుల్/ట్రేడ్స్‌మెన్ ఉద్యోగాలు..
Noise Buds” నాయిస్ బడ్స్ జస్ట్ 799లకే.. 50 గంటల ప్లేటైం..
Karimnagar news”బీసీలను అణగదొక్కుతున్న కాంగ్రెస్ కు గుణపాఠం చెప్పాలి
Bank Jobs” జూనియర్ అసిస్టెంట్ మేనేజర్ పోస్టులు 650.. ఏదైనా డిగ్రీతో.. పూర్తి వివరాలు..
