మీ అభిమానానికి వెయ్యి చేతులెత్తి మొక్కతున్నానని కేసీఆర్ అన్నారు. యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న మాజీ సీఎం కేసీఆర్ మంగళవారం అభిమానులు, పార్టీ నాయకులు, కార్యకర్తల గురించి మాట్లాడారు. నాకు అనుకోకుండా జరిగిన యాక్సిడెంట్‌తో యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సందర్భంగా ఇన్ ఫెక్షన్ వచ్చి నెలల తరబడి బయటకు పోలేరి వైద్య బృందం సీరియస్‌గా హెచ్చరిందని ఆయన చెప్పారు. దయచేసి సహకరించండని అభిమానులను, పార్టీ కార్యకర్తలను కోరారు. నాతోపాటు వందలాది పేషంట్లకు ఇబ్బంది కలగకూడదని చెప్పారు. కోలుకుని త్వరలోనే మీ నడుమకు వస్తాననన్నారు. ఇన్ఫెక్షన్ వస్తదని డాక్టర్లు నన్ను బయటకు పంపుతలేరని చెప్పారు. యశోద దవాఖాన కు రాకండని సూచించారు. తాను ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నానని త్వరలో సాధారణ స్థితికి చేరుకుని మీ నడుమకే వస్తానని అప్పడిదాకా సంయమనం పాటించాలని కోరారు. యశోద దవాఖానకు రావొద్దని తనతో పాటు వందలాది మంది పేషెంట్లు హాస్పిటల్ లో ఉన్నందున మన వల్ల వారికి ఇబ్బంది కలగకూడదని ప్రజలను వేడుకున్నారు. తన పట్ల అభిమానం చూపుతున్న కోట్లాది ప్రజలకు కృతజ్ఞత తెలుపుతూ గద్గద స్వరంతో చేతులు జోడించి మొక్కారు. తనను చూడడానికి వచ్చి మీరూ ఇబ్బంది పడొద్దు. హాస్పిటల్ లో ఉన్న పేషెంట్లను ఇబ్బంది పెట్టొద్దని పదే పదే వీడియో ద్వారా విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా ప్రజలనుద్దేశించి ప్రత్యేకంగా వీడియోను విడుదల చేసారు.
దయచేసి సహకరించండి
నాతోపాటు వందలాది పేషంట్లకు ఇబ్బంది కలగకూడదు
కోలుకుని త్వరలోనే మీ నడుమకు వస్తా
ఇన్ఫెక్షన్ వస్తదని డాక్టర్లు నన్ను బయటకు పంపుతలేరు
యశోద దవాఖాన కు రాకండి
– ప్రజలకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గారి విజ్ఞప్తి
తన ఆరోగ్య పరిస్థితి గురించి తెలుసుకొని పరామర్శించడానికి… pic.twitter.com/5pnev7TP16
— BRS Party (@BRSparty) December 12, 2023
కొత్త కార్డులపై త్వరలోనే నిర్ణయం తీసుకుంటాం మంత్రి ఉత్తమ్
కొత్త ప్రభుత్వానికి కొంత టైం ఇద్దాం : మాజీ మంత్రి హరీశ్‌రావు