Thursday , 5 December 2024

డ్రగ్స్‌ కేసులో ఎమ్మెల్యే అరెస్ట్‌

డంగ్స్ర్ కేసులో కాంగ్రెస్ ఎమ్మెల్యేను పంజాబ్ పోలీసులు గురువారం అరెస్ట్ చేశారు. డ్రగ్స్‌ స్మగ్లింగ్‌, మనీలాండరింగ్‌లో కాంగ్రెస్ ఎమ్మెల్యే సుఖ్‌పాల్‌ సింగ్‌ ఖైరాకు సంబంధాలు ఉన్న‌ట్టు తేల‌డంతో ఈ మేరకు పోలీసులు అరెస్ట్‌ చేశారు. పంజాబ్ లోని జలాలాబాద్‌లో పోలీసులు గురువారం తెల్ల‌వారు జామున సెర్చ్ ఆప‌రేష‌న్ నిర్వ‌హించారు. ఫజిల్కాలో ఖైరా నివాసానికి చేరుకుని ఆయన్ని క‌స్ట‌డీలోకి తీసుకున్నారు. 2015కు సంబంధించిన పాత డ్రగ్స్ కేసులో ఈ దాడి నిర్వహించారు. భోలాత్‌ నియోజకవర్గ ఎమ్మెల్యే సుఖ్‌పాల్‌ సింగ్‌ ఖైరా ఇందులో నిందితుడిగా ఉన్నాడు. నార్కోటిక్‌ డ్రగ్స్‌ అండ్‌ సైకోట్రోపిక్‌ సబ్‌స్టాన్సెస్‌ (ఎన్‌డిపిఎస్‌) చట్టం కింద గతంలో నమోదైన కేసులు న‌మోద‌య్యాయి. ఇంట‌ర్నేష‌న్లు స్మగ్లర్లతో సంబంధాలు, వారికి ఆశ్రయం కల్పించడం, మాదకద్రవ్యాల అక్రమ రవాణాదారుల నుంచి ఆర్థిక ప్రయోజనాలు పొందడం వంటివి ఆరోపణలు ఆయనపై ఉన్నాయి. దర్యాప్తు సంస్థ ఛార్జ్‌ షీట్‌ ప్రకారం.. ఈ విధంగా ఆర్జించిన నిధులను ఆస్తుల కొనుగోలుకు ఉపయోగించినట్లు తెలుస్తోంది. 2014 నుంచి 2020 మధ్య కాలంలో ఖైరా ప్రకటించిన ఆదాయానికి మించిన ఖర్చు చూపడంతో పోలీసుల నిఘా అతనిపై పడింది. దాదాపు రూ.6.5 కోట్లు ఖర్చు చేసినట్లు తేలింది. పోలీసుల తనిఖీల సమయంలో ఎమ్మెల్యే ఖైరా ఫేస్‌బుక్‌లో లైవ్‌లో ఉన్నారు. ఈ వీడియోలో తనను ఎందుకు అరెస్ట్‌ చేస్తున్నారని ఖైరా పోలీసులతో వాగ్వాదానికి దిగడం కనిపించింది. అరెస్ట్‌కు సంబంధించి వారెంట్‌ చూపించాలని కూడా అడగటం వీడియోలో కనిపిస్తుంది. అనంతరం పాత డ్రగ్స్‌ స్మగ్లింగ్‌ కేసులో అరెస్టు చేస్తున్నట్లు ఖైరాకు పోలీసు అధికారి డీఎస్పీ అచ్రు రామ్‌ శర్మ చెప్పడం వీడియోలో కనిపిస్తుంది. వీడియోలో ఎమ్మెల్యే ఖైరా ‘పంజాబ్‌ సర్కార్‌ ముర్దాబాద్‌ ‘అంటూ నినాదాలు చేస్తుండగా పోలీసు సిబ్బంది అతన్ని నిర్బంధించి స్టేషన్‌కు తరలించారు. ఎమ్మెల్యే అరెస్ట్‌ను అతని కుటుంబ సభ్యులు అడ్డుకోగా బలవంతంగా పోలీసులు తమ వాహనంలోకి ఎక్కించారు. అనంతరం జలాలాబాద్‌ పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు. ఈ అరెస్ట్‌ ఆప్‌, కాంగ్రెస్‌ల సంబంధాలను దెబ్బతీస్తుందని పలువురు రాజకీయ ప్రముఖులు భావిస్తున్నారు. పంజాబ్‌లో ఆప్‌తో పొత్తు, సీట్ల పంపకాలను కాంగ్రెస్‌ రాష్ట్ర యూనిట్‌ వ్యతిరేకిస్తున్న సంగతి తెలిసిందే.

పోయి రా .. ఖైర‌తాబాద్ వినాయ‌కుడి నిమ‌జ్జ‌నం పూర్తి

తండ్రిని గొడ్డలితో నరికి చంపిన కొడుకు

నిజామాబాద్‌లో అచ్చం జుల‌యి సినిమానే.. ఏటీఎం ప‌గ‌ల‌గొట్టి రూ. 10 ల‌క్ష‌లు చోరీ

 

ప‌క్క‌నున్న గంట గుర్తు నొక్క‌డం ద్వారా మా వార్త‌ల‌ను ఎప్ప‌టిక‌ప్పుడు తెలుసుకోవ‌చ్చు

About Dc Telugu

Check Also

05.12.2024 D.C Telugu Cinema

05.12.2024 D.C Telugu Morning

04.12.2024 D.C Telugu Cinema

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Social Media Auto Publish Powered By : XYZScripts.com