khammam crime news” భార్యాపిల్లలను చంపి రోడ్డు ప్రమాదమని నమ్మించాడో ప్రబుద్దుడు. మృతురాలి కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేయడంతో పోలీసులు హత్య కోణంలో దర్యాప్తు చేశారు. ఈ క్రమంలో విస్తుపోయే నిజాలు వెల్లడయ్యాయి. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండలం బాబోజీ తండకు చెందిన ప్రవీణ్ హైదరాబాద్‌లో ఒక దవాఖానాలో పిజియోతెరపిస్టుగా పని చేస్తున్నాడు. అతనికి భార్య బోడ కుమారి, ఇద్దరు పిల్లలు కృషిక, కృతికలున్నారు. ఈ క్రమంలో అదే హాస్పిటల్‌లో పనిచేస్తున్న సోని ప్రాన్సిస్ తో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. సోని ప్రాన్సిస్ తో కలిసి ఉండాలని తన భార్య, ఇద్దరు పిల్లల అడ్డు తొలగించుకోవాలని నిర్ణయించుకున్నాడు. 28 మే 2024 న కారులో వారి స్వగ్రామానికి వెళ్తున్న క్రమంలో తన భార్యకు కారులో మత్తుమందు సూది ఇచ్చాడు. ఇద్దరు ఆడ పిల్లల గొంతు నులిమి హత్య చేశాడు. ఆ తర్వాత కారును రోడ్డు పక్కకు ఒక చెట్టుకు గుద్ది రోడ్డు యాక్సిడెంట్లో చనిపోయినట్టు చిత్రీకరించాడు. మృతి చెందిన భార్య, పిల్లల శరీరాలపై ఎటువంటి గాయాలు లేకపోవడంతో అనుమానంతో భార్య కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు ప్రవీణ్‌ను అరెస్ట్ చేసి రిమాండ్ తరలించారు.
ఇవి కూడా చదవండి
Car Accident” కారు ఢీకొని ఎగిరిపడి వ్యక్తి మృతి.. వీడియో
Trump”అమెరికా మాజీ అధ్యక్షుడిపై కాల్పులు..
bulls fight Viral video” రైలును ఆపేసిన ఎద్దుల కొట్లాట.. వీడియో..