సంక్రాంతి పండుగను రెండు తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా జరుపుకుంటున్నారు. పండుగకు ఎంటర్‌టైన్‌మెంట్ తోడయితే ఆ కిక్కే వేరప్పా. అందుకే ప్రతి ఏడు సంక్రాంతిని సినీ ఇండస్ట్రీ కూడా క్యాచ్ చేసుకుంటది. ఈ ఏడు కూడా స్టార్ హీరోల నుంచి సినిమాలు విడుదలకు సిద్దమవుతున్నాయి. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న చిత్రాలలో సైంధవ్, ఈగల్, హనుమాన్ ఉన్నాయి. ఈ మూడు సినిమాలు సంక్రాంతి బరిలో నుంచి తప్పుకోవడానికి సిద్ధంగా లేవు. గుంటూరు కారం, ఫ్యామిలీ స్టార్ సినిమాల షూటింగ్ ఇంకా ఎక్కువగా చిత్రీకరించాల్సి ఉంది. నాగార్జున నటిస్తున్న నా సామి రంగ వేగంగా షూటింగ్ ను పూర్తి చేసుకోంటుంది. సంక్రాంతిని టార్గెట్ పెట్టుకుని ఈ సినిమాను రిలీజ్ చేసేందుకు చిత్ర నిర్మాతలు కృషి చేస్తున్నారు. గతంలో సంక్రాంతి పండుగకు రిలీజ్ అయిన నాగార్జున సినిమాలు మాంచి హిట్టునందుకున్నాయి. సోగ్గాడే చిన్ని నాయన, బంగర్రాజు లాంటి సినిమాలు హిట్టుకొట్టాయి. ఇప్పుడు బిన్ని దర్శకత్వంతో వస్తున్న నా సామి రంగ పూర్తిగా మాస్ ఫ్యామిలీ ఎంటర్టైన్‌మెంట్. ఈ సినిమా జనవరి 12 న విడులయ్యే అవకాశాలున్నాయి. గుంటూరు కారం మాస్ కంటెంట్‌తో నా సామి రంగ సినిమాకు పోటీగా నిలువనుంది.