diabetes drug” డయాబెటిస్ ప్రపంచాన్ని వణికిస్తోంది. డయాబెటిస్, మధుమేహం, షుగర్ వ్యాధి ఇలా అనేక పేర్లతో పిలుస్తున్నారు. ఒక్కసారి డయాబెటిస్ బారిన పడితే జీవితాంతం మందులు మింగాల్సిందే. తిండిని కూడా అదుపులో పెట్టుకుని జాగ్రత్తగా ఉండాల్సిందే. డయాబెటిస్ ను ఎదుర్కొనేందుకు నిత్యం ఎన్నో పరిశోధనలు జరుగుతున్నాయి. ఇప్పటికే మార్కెట్లో అనేక రకాల మందులు డయాబెటిస్ ను నియంత్రించేందుకు అందుబాటులో ఉన్నాయి. దీనిని మరింత సమర్ధవంతంగా ఎదుర్కొనేందుకు (Japan) జపాన్ శాస్త్రవేత్తలు మరో కొత్తరకం డ్రగ్‌ను అందుబాటులోకి తెచ్చారు. అదే హెచ్‌పీహెచ్ 15 అనే ఔషధం. ఇది రక్తంలోని చక్కెరను నియంత్రించడంతో పాటు షుగర్ వ్యాధితో వచ్చే దుష్ప్రభావాలను కూడా తగ్గిస్తున్నది. ముఖ్యంగా డయాబెటిస్ వ్యాధి గ్రస్తుల్లో కొవ్వు పేరుకుపోతుంది. శరీంరంలో పేరుకపోయిన కొవ్వును కూడా ఈ హెచ్‌పీహెచ్ 15 అనే ఔషధం అదుపులో ఉంచుతుంది. (Japan) జపాన్ దేశంలోని కుమమొటో (University) యూనివర్సిటీ సైంటిస్టులు దీనిని అభివృద్ధి పరిచారు. ఈ ఔషధం రక్తంలోని షుగర్‌ను కంట్రోల్ చేయడంతో పాటు పేరుకుపోయిన కొవ్వును కూడా తగ్గించేందుకు సమర్ధవంతంగా పనిచేస్తున్నదని వారు తెలిపారు. ప్రస్తుతం వాడుతున్న (Metformin) మెట్‌ఫార్మిన్ కంటే ఇది మెరుగ్గా పనిచేస్తుందని (Japan) జపాన్ శాస్త్రవేత్తలు వెల్లడించారు.
ప్రొఫెసర్ ఐచి అరకి, అసోషియేట్ ప్రొఫెసర్ హీరోషి తతిషీ నేతృత్వంలోని రీసెర్చ్ బృందం హెచ్‌పీహెచ్ 15 అనే ఔషధాన్ని అభివృద్ది చేశారు. దీనికి సంబంధించిన వివరాలను (Diabetology) డయాబెటోలోజియా అనే జర్నల్‌లో ప్రచురితమయ్యాయి. ప్రస్తుతం ఎలుకల మీద ప్రీ క్లినికల్ ట్రయల్స్ విజయవంతం అయినట్టు తెలుస్తున్నది. కాలేయం, కండరాలు, కొవ్వు కణాలు గ్లూకోజును తీసుకోవడాన్ని మెరుగుపరుస్తున్నది. దీంతో పాటు (Insulin) ఇన్సులిన్ సెన్సిటివిటిని మెరుగు పరుస్తుందని వారు వివరించారు. తక్కువ డోసుతోనే మెరుగ్గా పనిచేస్తుందని తేల్చారు. చర్మం కింద పేరుకుపోయిన కొవ్వును తగ్గిస్తుంది. (Fatty liver) ఫ్యాటీ లివర్ సమస్యను కూడా నయం చేస్తుందని సమర్థవంతంగా పనిచేస్తున్నదని పేర్కొన్నారు. మధుమేహం తో పాటు ఉబకాయం ఉన్నవారిని ఈ మందు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని జపాన్ సైంటిస్టులు వివరించారు.
Digital Camera” వాటర్‌ప్రూఫ్ యాక్షన్ డిజిటల్ కెమెరా.. అమెజాన్లో..
పై ఇయర్ బడ్స్ ను కొనేందుకు ఈ లింక్ ను క్లిక్ చేయండి… https://bitli.in/ySOr7nY
పై చెప్పులను కొనేందుకు ఈ లింక్ ను క్లిక్ చేయండి…https://myntr.it/fLQ5WAb
Digital Camera” వాటర్‌ప్రూఫ్ యాక్షన్ డిజిటల్ కెమెరా.. అమెజాన్లో..
cold” వణుకుతున్న తెలంగాణ.. మరో రెండు రోజులు గజ గజే
Tenth Exams” మార్చి 21 నుంచి టెన్త్ పరీక్షలు
Bluetooth Soundbar” ఈ సౌండ్ బార్‌ను తీసుకెళ్లండి.. మీ ఇంటిని హుషారెత్తించండి.. జస్ట్ రూ.1999కే.
Bluetooth Soundbar” ఈ సౌండ్ బార్‌ను తీసుకెళ్లండి.. మీ ఇంటిని హుషారెత్తించండి.. జస్ట్ రూ.1999కే.
lunch box” చిన్నపిల్లల లంచ్ బాక్స్.. కేవలం 125 మాత్రమే
Udupi accident” రివర్స్ తీసుకుంటున్న కారు. వెనక నుంచి వేగంగా ఢీ కొట్టిన ట్రక్కు.. వీడియో
పై వాచ్ ను కొనేందుకు ఈ లింక్ ను క్లిక్ చేయండి.. https://ajiio.in/dEtzNeq