New RTC Bus Depo” తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొదటిసారి రాష్ట్రంలో కొత్త ఆర్టీసీ బస్ డిపోలు ఏర్పాటు కానున్నాయి. వీటిపై రేవంత్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ములుగు జిల్లాలోని ఏటూరు నాగారంలో , పెద్దపల్లి జిల్లా కేంద్రాల్లో కొత్తగా బస్ డిపోలు ఏర్పాటుకు ఆదేశాలు జారీ చేసింది. ఈ క్రమంలోనే ములుగు జిల్లాలోని ఏటూరు నాగారంలో డిపో ఏర్పాటు చేయడంపై మంత్రి సీతక్క హర్హం వ్యక్తం చేశారు. మూడు రాష్ట్రాల సెంటర్ గా ఉన్న ఏటూరు నాగారంలో ఆర్టీసీ బస్సు డిపో మంజూరు కావటం పట్ల సీతక్క హర్షం వ్యక్తం చేశారు. ఏటూరు నాగారం నగరంలో బస్సు డిపో మంజూరు కావడంతో ఏజెన్సీ ప్రజల చిరకాల వాంఛ నెరవేరిందన్నారు. పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రి సీతక్క, ములుగు డిసిసి అధ్యక్షులు పైడాకుల అశోక్ లు సెక్రటేరియట్‌లో రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, రవాణా శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ వికాస్ రాజ్‌లను కలిసి వారికి ధన్యవాదాలు తెలిపారు.
RTC Depot Sanctioned for Eturunagaram in Mulugu District
ములుగు జిల్లాలోని ఏటూరు నాగారంకు ఆర్టీసీ డిపో మంజూరు
డిపో మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం.
మూడు రాష్ట్రాల సెంటర్ గా ఉన్న ఏటూరు నాగారం కి ఆర్టీసీ బస్సు డిపో మంజూరు కావటం పట్ల సీతక్క హర్షం.
ఏటూరు నాగారం… pic.twitter.com/RwCRAxXslj— Congress for Telangana (@Congress4TS) December 5, 2024
ఇవి కూడా చదవండి
Power Bank”1099 రూపాయలకే అమెజాన్ బ్రాండ్ పవర్ బ్యాంక్
Nova Water Heater” నోవా వాటర్ హీటర్.. సంవత్సరం వారంటీ.. షాక్ ఫ్రూఫ్
Puspha 2″ మహిళ మృతిపై స్పందించిన పుష్ప-2 టీం..
TOSHIBA TV” తోషిబా 32 ఇంచుల టీవీ 12,999 రూపాయలకే..
Medak News” బైక్‌ను ఢీ కొట్టిన ట్యాంకర్.. మంటలు చెలరేగి.. వీడియో