ఒక ప్రముఖ మీడియాకు చెందిన జర్నలిస్ట్.. రేణూ దేశాయ్ ని చాలా అసభ్యకరంగా.. అభ్యంతరకరంగా మాట్లాడుతూ ఇన్ స్టా లో మెసేజ్ చేశారు. దీనికి నేరుగా రేణూ దేశాయ్ స్పందిస్తూ తన ఆవేదన వ్యక్తం చేశారు. నిజం చెబితే నన్ను ఇలా అభ్యంతరకర భాషతో నిందిస్తారా? మీకు నన్ను ఇలా అనడంలో మనశ్శాంతి దొరికిందా? ఇంకా చెప్పండి.. నా జీవితం మీలాంటి వాళ్ళ తిట్లు తినడానికే.. అంటూ రేణూ దేశాయ్ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మెసేజ్ చూసిన నెటిజన్లు సదరు జర్నలిస్ట్ పై విరుచుకుపడుతున్నారు. అంత పెద్ద ఛానల్ లో సీనియర్ జర్నలిస్ట్ గా ఉన్నావు.. నీకు ఇదేమి పొయ్యేకాలం అంటూ ఒక నెటిజన్ మెసేజ్ పెట్టారు. అతన్ని రిపోర్ట్ చేయాలని ఒక నెటిజన్ రేణూ దేశాయ్ కి సూచించాడు. ఆ మీడియా సంస్థకు వైకల్యం ఎక్కువ.. ఇలానే మంది మీద ఏడుస్తుంది.. అందులో పనిచేసేవారు కూడా అంతే అంటూ అందర్నీ కలిపి తిడుతున్నారు నెటిజన్స్. చూడాలి సదరు జర్నలిస్ట్ ఏరకంగా రియాక్ట్ అవుతారో. హుందాగా తప్పు ఒప్పుకుంటారో.. మరింత పీకి పంచాయతీ చేస్తారో..
రేణు దేశాయ్ స్పందించిన తీరు
రేణు దేశాయ్ సోషల్ మీడియాలో పరిచయం అక్కర్లేని పేరు. ఒకప్పటి హీరోయిన్ కంటే పవన్ కళ్యాణ్ మాజీ భార్యగానే ఎక్కువగా పరిచయం. ఈమె సోషల్ మీడియాలో పెట్టే పోస్టులపై ఎప్పుడు చర్చ జరుగుతూనే ఉంటుంది. తాజాగా ఇప్పుడు కూడా ఒక పోస్ట్ వైరల్ అవుతోంది.
పవన్ కళ్యా ణ్ మోసం చేశాడని రేణూ దేశాయ్ చెబుతూనే.. అతనికి డబ్బంటే ఆసక్తి లేదని, డబ్బు మనిషి కాదని, సమాజం పట్ల బాధ్యత ఉన్న వ్యక్తి అంటూ.. ఆయనకు ఒకసారి అవకాశం ఇవ్వండి అంటూ రేణూ దేశాయ్ ఓ వీడియోను షేర్ చేసింది. దీనిపై తెలుగు ప్రజలు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. రేణూ దేశాయ్‌ని జన సైనికులు పవన్ కళ్యాణ్ అభిమానులు,ఆకాశానికి ఎత్తెస్తున్నారు. పీకే వ్యతిరేకులు మాత్రం తిట్టి పోస్తున్నారు. రేణూ దేశాయ్‌ని ఇతర పార్టీకి చెందిన ఫాలోవర్లు మాత్రం ట్రోలింగ్ చేస్తున్నారు.
ఈక్రమంలోనే ఓ నెటిజన్ ఇలా కామెంట్ చేశాడు. పపవన్ కళ్యాణ్ అందుకే తన్ని తరిమేశాడు మేడం అంటూ కామెంట్ చేశారు. నన్ను తిట్టడంతో నీకు మనశ్శాంతి దొరికిందా?.. దొరకకపోతే ఇంకా తిట్టండి.. నా మాజీ భర్త అభిమానులు, వ్యతిరేకుల నుంచి తిట్లు తినడానికే నా జీవితం ఉంది.. కానివ్వండి అంటూ సల్లగా రిప్లయి ఇచ్చింది రేణూ దేశాయ్ .
నాకు పవన్ కళ్యాణ్ మధ్య జరిగిన విడాకుల పై ఏం జరిగిందో వాస్తవం మాట్లానప్పుడు ఆయన అభిమానులు తిట్టిపోశారు. భారత పౌరురాలిగా పవన్ కళ్యాణ్‌కు సపోర్ట్ గా మాట్లాడినందుకు ఆయన పడని వారు, ఇతర పార్టీ వారు ఇయ్యాల తిడుతున్నారు. మొదటి మాట్లడినప్పుడు కొన్ని పార్టీల వద్ద పైసలు తీసుకొని మాట్లాడరని తిట్టిపోశారు. ఇప్పుడు నా మాజీ భర్త పవన్ దగ్గర డబ్బులు తీసుకున్నాని ఇలా అంటున్నారని బాధపడ్డారు. అప్పుడైనా ఇప్పుడైనా నేను నిజమే మాట్లాడుతాను. ఏనాడు ఒక్క మాట కూడా అబద్దం ఆడలేదు. నిజాలు చెబుతున్నందుకు నిజంగా ప్రేమించినందుకు నాకు జరుగుతుంది ఇదే . ఇదే నా విధి అయితే అట్లనే ఉండనీయండి.. ఇంకా తిట్టడం ప్రారంభించండి ఆమె బాధపడ్డది.ఈ రకంగా రేణ్ దేశాయ్ స్పందించడంతో నెటిజన్లు ఆమెకు మద్దతుగా నిలిచారు..
మీరు స్పందిస్తే కావాలని రెచ్చగొడుతారు..మీ ఇద్దరి మధ్య గొడవలు పెట్టడం కోసం అంటూ మరో నెటిజన్ ఆ రిపోర్టర్ ను కడిగిపారేశారు.
ధైర్యంగా ఉండండి అంటూ మరో నెటిజన్ ఆమెకు సపోర్ట్‌గా నిలిచాడు.
https://www.instagram.com/p/CwA0TpKo7H4/?utm_source=ig_web_copy_link