#Nagpur : Man Transports Wife’s Body On Motorcycle After Fatal #Accident. The incident took place on #Sunday at nearly 12 p.m. on the Nagpur-Jabalpur National Highway near the Morfata area under the Deolapar police jurisdiction. The woman identified as Gyarsi Amit Yadav. pic.twitter.com/O8liA65QIT
— CMNS_Media⚔️ #Citizen_MediaVEDA (@1SanatanSatya) August 11, 2025
Nagpurincident” హృదయాన్ని కలిచివేసే ఘటన నాగర్‌పూర్‌లో చోటు చేసుకుంది. భార్య శవాన్ని ద్విచక్రవాహనంపై తీసుకెళ్తున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. వివరాల్లోకి వెళ్తే.. మధ్యప్రదేశ్‌లోని సీవనీకి చెందిన 35 సంవత్సరాల వయసున్నఅమిత్ యాదవ్ అనే వ్యక్తి తన భార్య గ్యార్సీతో కలిసి నాగపూర్‌లోని లోనారా అనే ప్రాంతంలో నివాసముంటున్నాడు. ఈ క్రమంలో ఆదివారం వారిద్దరూ లోనారా నుంచి మధ్యప్రదేశ్‌లోని కరన్‌పూర్‌కు బైక్‌పై వెళ్తున్నారు. ఈ క్రమంలో మార్గమధ్యలో మోర్ ఫాటాకు చేరుకోగానే వేగంగా వచ్చిన లారీ వారిని ఢీ కొట్టింది. ఈ ఘటనలో గ్యార్సీ రోడ్డుపై పడిపోయింది.
లారీ ఆగకుండా ఆమెను పైపైగా వెళ్లిపోయింది.
అమిత్ తన భార్యను కాపాడాలని చాలా మంది ప్రయాణికులను సాయంగా కోరాడు. కానీ ఎవరూ ఆగలేదు. ఎలాంటి సహాయం దొరకక లేదు. దీంతో తన భార్య శవాన్ని బైక్‌కు కట్టి స్వగ్రామం వైపు బయలుదేరాడు. ఈ దృశ్యం వీడియో రూపంలో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయింది.
కొద్దిసేపటికే పోలీసులు అమిత్ బైక్‌ను ఆపి శవాన్ని నాగ్‌పూర్‌లోని ఇందిరా గాంధీ మెడికల్ కాలేజ్‌కు పోస్టుమార్టం కోసం తరలించారు. పోలీసులు దీనిని ప్రమాద మరణంగా నమోదు చేశారు.
అధికారుల ప్రకారం, పోస్టుమార్టం నివేదిక వచ్చిన తర్వాత మరింత చర్య తీసుకుంటారు. అమిత్, గ్యార్సి మధ్యప్రదేశ్‌లోని సీవనీకి చెందినవారు కాగా ప్రస్తుతం నాగ్‌పూర్‌లోని లోనారా ప్రాంతంలో నివసిస్తున్నారు.

గోద్రెజ్ నుండి మన్నికైన భద్రత!
ఇప్పుడు లభ్యమవుతుంది Godrej Sherlock Pro (70mm) Padlock – మిమ్మల్ని మోసగాళ్ల నుండి రక్షించే శక్తివంతమైన తాళం!
✅ ప్రీమియం సాలిడ్ బ్రాస్ లాక్
✅ 4 కీలు లభ్యం
✅ డబుల్ లాకింగ్ మెకానిజం
✅ సెల్ఫ్-లాకింగ్ షాకిల్
✅ తుప్పు పట్టని టెక్నాలజీ
✅ డోర్లకు అద్భుతంగా సరిపోతుంది
️ 5 సంవత్సరాల వారంటీ
ప్రత్యేక డీల్స్‌లో భాగంగా: ₹1,080/- (20% డిస్కౌంట్)
గత నెలలో 50+ మంది కొనుగోలు చేశారు!
అమెజాన్‌లో కొనేందుకు https://amzn.to/4mbCHBi లింక్ పై క్లిక్ చేయండి..
