Peddapalli” పి.ఎం.జే.జే.బి.వై పథకాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి
పి.ఎం.జే.జే.బి.వై పథకం క్రింద 2 లక్షల రూపాయల బీమా చెక్కును పంపిణీ చేసిన జిల్లా కలెక్టర్.
మార్చి 11 మంగళవారం 2025
ఇండియా పోస్ట్ పేమెంట్ బ్యాంకు ద్వారా 436 రూపాయల ప్రీమియం తో 2 లక్షల బీమా లభిస్తుందని జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష తెలిపారు. మంగళవారం జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష సమీకృత జిల్లా కలెక్టరేట్ లో తన చాంబర్ లో పి.ఎం.జే.జే.బి.వై పథకం కింద సంబంధిత కుటుంబ సభ్యులకు రూ. 2 లక్షల రూపాయల చెక్కును పంపిణీ చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష మాట్లాడుతూ.. ప్రధాన మంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన లో భాగంగా 2 సంవత్సరాల్లో పెద్దపెల్లి జిల్లా ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ బ్రాంచ్ ద్వారా 20 మందికి బీమా క్లెయిమ్ సెటిల్ చేసినట్టు తెలిపారు.
18 నుంచి 50 సంవత్సరాల వయసు ఉన్నవారు సంవత్సరానికి రూ. 436లతో ప్రీమియం చెల్లించొచ్చన్నారు. పి.ఎం.జే.జే.బి.వై లో చేరే వారు 55 సంవత్సరాల వయసు వరకు ప్రీమియం రెన్యువల్ చేసుకోవచ్చని వివరించారు. బీమా కట్టిన వారు సాధారణంగా 30 రోజుల తరువాత మరణిస్తే , ప్రమాదవశాత్తు 24 గంటల తరువాత మరణిస్తే దరఖాస్తు చేసుకున్న 5 పని దినాలలో రూ. 2 లక్షల రూపాయల బీమా సొమ్ము అందిస్తారని కలెక్టర్ తెలిపారు.
పీ.ఎం.జే.జే.బి.వై ప్రీమియం చెల్లించిన నూనె రవి గుండెపోటుతో మరణించారని, దీంతో అతని సతీమణి నూనె లక్ష్మి కి డెత్ సర్టిఫికెట్ తో దరఖాస్తు చేసుకున్న 5 రోజులలో బీమా సొమ్ము రూ. 2 లక్షల రూపాయలు ఈరోజు అందించామని కలెక్టర్ చెప్పారు. జిల్లాలోని ప్రజలంతా పీ.ఎం.జే.జే.బి.వై పథకాన్ని వినియోగించుకోవాలని సూచించారు. తప్పనిసరిగా ప్రీమియం చెల్లించాలని కలెక్టర్ పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో పెద్దపల్లి లీడ్ బ్యాంకు మేనేజర్ వెంకటేష్, ఇండియన్ పోస్ట్ పేమెంట్ సీనియర్ మేనేజర్ కొట్టే శ్రీనివాస్, మేనేజర్ మోహన్ సాయి, తదితరులు పాల్గొన్నారు .
ఇవి కూడా చదవండి
RedMi” రెడ్ మీబొనంజా ఆఫర్… తక్కువ ధరల్లోనే స్మార్ట్ ఫోన్స్
Peddapalli News” జిల్లా యువతకు గుడ్ న్యూస్.. ఫుడ్ ఫ్రాసిసెంగ్ లోన్లపై సబ్సిడీ..
Constable Jobs” ఐటీబీపీ కానిస్టేబుల్ రిక్రూట్‌మెంట్ పదో తరగతి అర్హత
Smart TV” 40 ఇంచుల బ్రాండెడ్ టీవీ కేవలం రూ. 16,990లకే..
Smart TV” చవకాలో టీవీ కొనాలనుకుంటున్నారా..? ఏఐ విజన్‌తో 40 ఇంచుల జేవీసిని చూడండి…
Bus accident” బైక్ తప్పించబోయి.. బోల్తా పడ్డ బస్సు.. వీడియో