Mankondur”మృతుడి భార్యకు గాయత్రి బ్యాంక్ చెక్కు అందజేత..

Mankondur” చెక్కు అందజేసిన ఎమ్మెల్యే…
శంకరపట్నం డిసీ ప్రతినిధి
రోడ్డు ప్రమాదంలో మరణించిన కరీంనగర్ గాయత్రి బ్యాంక్ ఖాతాదారుడు కెన్నరసారం తిరుపతి సతీమణి వెంకటలక్ష్మికి లక్ష రూపాయల భీమా మొత్తాన్ని మానకొండూర్ శాసనసభ్యుడు డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ మంగ‌ళ‌వారం అందజేశారు. కేశవపట్నం గ్రామానికి చెందిన తిరుపతి ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించారు. నామిని అయిన అతని భార్య వెంకటలక్ష్మికి ఎల్ఎండి కాలనీలోని క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే చెక్కును అందించారు. ఈ కార్యక్రమంలో గాయత్రి బ్యాంక్ కరీంనగర్ బ్రాంచ్ మేనేజర్ గొట్టె అశోక్, సీనియర్ ఆఫీసర్ వేముల విష్ణువర్ధన్, జూనియర్ ఆఫీసర్ ఉల్లంగుల అనిల్, బ్యాంకు అడ్వకేట్ కొరిమి ప్రవీణ్ కుమార్, కేశవపట్నం కాంగ్రెస్ పార్టీ నాయకుడు గోడిశాల ప్రవీణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *