Peddapalli News” మార్చి 12 నుంచి పి.ఎం.ఎఫ్.ఎం. దరఖాస్తుల స్వీకరణ
రుణ రాయితీతో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల ఏర్పాటుకు దరఖాస్తుల ఆహ్వానిస్తున్నామని జిల్లా పరిశ్రమల అధికారి ఎ.కీర్తి కాంత్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ఆహార శుద్ధి సంస్థ ఆదేశాల మేరకు పెద్దపల్లి జిల్లాలో ప్రధాన మంత్రి ఫార్మలైజేషన్ ఆఫ్ మైక్రో ఫుడ్ ప్రాసెసింగ్ ఎంటర్ ప్రైజెస్ ( పి ఎం ఎఫ్ ఎం) ఈ స్కీం లో భాగంగా 35% రుణ రాయితీ తో పుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల ఏర్పాటుకు రుణాల మంజూరు కోసం మార్చి 12 నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నామని తెలిపారు. జిల్లాలోని రైతులు, మహిళలు, నిరుద్యోగ యువతి, స్వయం సహాయక సంఘాలు రైతులు ఉత్పత్తిదారుల సంఘాలు, ప్రైవేట్ ఆహార పరిశ్రమలు, స్వచ్ఛంద సంస్థలు, గ్రామీణ యువత ఆసక్తి కలిగిన వారు సద్వినియోగం చేసుకుని ఆర్థికంగా ఎదగాలని తెలిపారు. అదే విధంగా రైస్ మిల్లులు, వాటికి సంబందించిన సార్ట్ టెక్స్, ఎఫ్ ఆర్ కె మెషీనరికి సంబందించి సబ్సిడీ రుణ సదుపాయం సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఆసక్తి గలవారు తమ దరఖాస్తును పూర్తి వివరాలతో ఆధార్ కార్డు,పాన్ కార్డు, బ్యాంక్ పాస్ పుస్తకం, కరెంట్ బిల్లు, యూనిట్ యొక్క సంబందించిన వివరాలతో జిల్లా డి.ఆర్.పి. మియాపురం రామకృష్ణను సంప్రదించవలసిందిగా లేదా 6305345388 నెంబర్ కు సంప్రదిం చొచ్చని పేర్కొన్నారు. తమ దరఖాస్తును జిల్లా పరిశ్రమల కేంద్రం లోని రూమ్ నెం. 231 సమీకృత జిల్లా అధికారుల సముదాయంలో సమర్పించాలని జిల్లా పరిశ్రమల శాఖ జనరల్ మేనేజర్ ఆ ప్రకటనలో పేర్కొన్నారు.
Karimnagar news” ఎమ్మెల్యే కవ్వంపల్లి పై రసమయి తప్పుడు ఆరోపణలు..
Karimnagar news” ఈ కోర్టు తీర్పు కుల అహంకారానికి చెంపపెట్టు
Cinema News” ఆ మార్క్‌ను దాటిన సంక్రాంతికి వస్తున్నాం..