Diabetes” అంతర్జాతీయ డయాబెటిస్ ఫెడరేషన్ ప్రకారం.. భారతలో దేశంలో సుమారు 10. కోట్ల కు పైగా మంది మధుమేహంతో బాధ పడుతున్నారు. డయాబెటిస్ ఒక్కసారి నిర్దారణ అయితే జీవితాంతం దాన్ని అదుపులో పెట్టుకోవాల్సిందే. నిత్యం చెక్ చేసుకుంటూ డాక్టర్ను సంప్రదిస్తూ క్రమం తప్పకుండా మందులు వాడాలి. ఇందుకోసం వాడే మందుల్లో ఎంపాగ్లి ఫోజిన్ అనే మందు తక్కువ ధరకే అందుబాటులోకి రానుంది. ఈ మందును తయారు చేస్తున్న బో హ్రీంగర్ ఇంగెల్మ్ పేటెంట్ గడువు మార్చి 11 తో ముగుస్తుంది. దేశీయంగా కంపెనీ దాని కెమికల్ ఫార్ములాతో జెనరిక్ వెర్షన్‌ను తీసుకురానుంది. మ్యాన్ కైండ్ ఫార్మా, టోరెంట్, ఆల్కెమ్, డాక్టర్ రెడ్డీస్, లుపిన్ వంటి కంపెనీలు ఈ ఔషదాన్ని తయారు చేసేందుకు సిద్ధంగా ఉన్నాయి.
మన దేశంలో నాల్గో అతిపెద్ద ఫార్మాస్యూటికల్ కంపెనీ అయిన మ్యాన్ కైండ్ ప్రకారం.. ఎంపాగ్లిఫో జీన్ ఇన్నోవేటర్ సుమారు ధర 60 రూపాయలుగా ఉంది. అయితే ఈ ఔషదాన్ని జెనరిక్ వెర్షన్లో పదో వంతుకు అందించాలని భావిస్తున్నారు. దీంతో ఒక్కో టాబ్లెట్ ధర 9 రూపాయల నుంచి 14 రూపాయల మధ్య ఉండనున్నట్టు అంచనా..
డయాబెటిస్‌కు ప్రైమరీ మెడిసిన్‌గా మెట్ ఫార్మిన్ ఉంది. మధుమేహ వ్యాధి ముదిరేకొద్ది ఇతర ఔషదాలు అవసరమవుతాయి. సల్ఫోనిలురియస్, ఢీపీపీ ఫోర్ ఎంపాగ్లిపోజిన్‌తో సహా అదనంగా మందులు అవసరంపడుతాయి… ఈ క్రమంలో ఎంపాగ్లిపోజిన్ పేటెంట్ ముగియడంతో దీని ధరలు తక్కువకే అందుబాటులో ఉండునున్నాయి.. సాధారణంగా అయితే బ్రాండెడ్ ఔషధాల తయారీపై సదరు కంపెనీకి 20 సంవత్సరా పేటెంట్ హక్కులుంటాయి. ఈ 20 ఏండ్ల ఈ సమయంలో కంపెనీ పర్మిషన్ లేకుండా మరే ఇతర కంపెనీలు ఈ మందులను తయారు చేయకూడదు. పేటెంట్ హక్కు ముగిసిన తర్వాత అదె కెమికల్ ఫార్మూలతో, క్లినికల్ ట్రయల్స్ లేకుండా ఔషదాన్ని తయారు చేస్తారు. దీంతో ధరలు గణనీయంగా తగ్గుతాయి..
Peddapalli News” జిల్లా యువతకు గుడ్ న్యూస్.. ఫుడ్ ఫ్రాసిసెంగ్ లోన్లపై సబ్సిడీ..
QLED Smart tv: జేవీసీ 32 ఇంచుల టీవీ ఇది.. ఫీచర్ల్ ఇవే..
Smart Phone” ఐక్యూ 12 5జీ లెజెండ్ స్మార్ట్ ఫోన్… 256 స్టోరేజీతో..
Constable Jobs” ఐటీబీపీ కానిస్టేబుల్ రిక్రూట్‌మెంట్ పదో తరగతి అర్హత
Constable Jobs” ఐటీబీపీ కానిస్టేబుల్ రిక్రూట్‌మెంట్ పదో తరగతి అర్హత